Telugu Global
International

హెలికాప్టర్‌ కూలి.. యాక్సెస్‌ బ్యాంక్‌ సీఈవో సహా ఆరుగురు మృతి

ఈ ఘటన ఆఫ్రికా బ్యాంకింగ్‌ రంగానికి పెద్ద షాక్‌ అని వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎవాలా ఎక్స్‌లో పోస్టు చేశారు. హెర్బర్ట్‌ విగ్వే గతంలో గ్యారెంటీ ట్రస్ట్‌ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు.

హెలికాప్టర్‌ కూలి.. యాక్సెస్‌ బ్యాంక్‌ సీఈవో సహా ఆరుగురు మృతి
X

హెలికాప్టర్‌ కూలి యాక్సెస్‌ బ్యాంక్‌ సీఈవో సహా ఆరుగురు మృతిచెందిన ఘటన అమెరికాలోని కాలిఫోర్నియా–నెవడా సరిహద్దుల్లో జరిగింది. మృతిచెందినవారిలో నైజీరియాకు చెందిన అతి పెద్దదైన యాక్సెస్‌ బ్యాంక్‌ సీఈవో హెర్బర్ట్‌ విగ్వేతో పాటు ఆయన భార్య, కుమారుడు, ఎన్‌డీఎక్స్‌ గ్రూపు మాజీ చైర్మన్‌ అబింబోలా, ఇద్దరు పైలట్లు ఉన్నారు. యూరోకాప్టర్‌ ఈసీ 130లో మోజువా ఎడారిపై ప్రయాణిస్తుండగా శాన్‌ బ్రెనార్డినో కౌంటీ వద్ద శుక్రవారం రాత్రి ఈ ప్రమాదం జరిగింది. దాదాపు 3,000 అడుగుల ఎత్తు నుంచి అది కుప్పకూలడంతో.. అందులో ఉన్నవారంతా ప్రాణాలు కోల్పోయారు. సమీపంలోని ఐ–15 జాతీయ రహదారిపై ప్రయాణిస్తున్నవారు ప్రమాదాన్ని గమనించి 911కు కాల్‌ చేశారు. ప్రమాదంపై ఎఫ్‌ఏఏ దర్యాప్తు చేపట్టింది.

ఈ ఘటన ఆఫ్రికా బ్యాంకింగ్‌ రంగానికి పెద్ద షాక్‌ అని వరల్డ్‌ ట్రేడ్‌ ఆర్గనైజేషన్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఎవాలా ఎక్స్‌లో పోస్టు చేశారు. హెర్బర్ట్‌ విగ్వే గతంలో గ్యారెంటీ ట్రస్ట్‌ బ్యాంకులో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేశారు. నైజీరియా ‘యాక్సెస్‌ బ్యాంక్‌’ ఆఫ్రికాలోని పలు దేశాల్లో సేవలు అందిస్తోంది. ఇటీవలే అమెరికాలోని శాన్‌ డియాగో వద్ద ఓ సైనిక హెలికాప్టర్‌ కూలి ఐదుగురు మెరైన్కర్‌ సిబ్బంది చనిపోయారు. ఆ తర్వాత కొద్దిరోజులకే తాజాగా ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

First Published:  11 Feb 2024 1:31 PM IST
Next Story