Telugu Global
International

నేపాల్ ప్లేన్ క్రాష్: 45 మృతదేహాలు వెలికి తీత, మిగతావాళ్ళు కూడా బతికే అవకాశం తక్కువంటున్న అధికారులు

ప్రయాణీకులలో 53 మంది నేపాలీ పౌరులు, 5 మంది భారతీయులు, 4గురు రష్యన్లు, ఒక ఐరిష్ పౌరుడు, ఇద్దరు కొరియన్లు, 1 అర్జెంటీనా పౌరుడు, ఒక ఫ్రెంచ్ జాతీయుడు ఉన్నారని ఎయిర్‌పోర్ట్ అథారిటీ తెలిపింది.

నేపాల్ ప్లేన్ క్రాష్: 45 మృతదేహాలు వెలికి తీత, మిగతావాళ్ళు కూడా బతికే అవకాశం తక్కువంటున్న అధికారులు
X

నేపాల్ లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఇప్పటి వరకు 45 మృతదేహాలను వెలితీశారు. యతి ఎయిర్ లైన్స్ అధికారుల ప్రకారం మిగతావారు కూడా బతికే అవకాశం తక్కువగా ఉంది.

ఖాట్మండు నుంచి పోఖ్రా వెళ్తున్న ఈ యతి ఎయిర్ లైన్స్ విమానంలో 68 మంది ప్రయాణీకులు నలుగురు విమాన సిబ్బంది ఉన్నారు. ప్రయాణీకులలో 53 మంది నేపాలీ పౌరులు, 5 మంది భారతీయులు, 4గురు రష్యన్లు, ఒక ఐరిష్ పౌరుడు, ఇద్దరు కొరియన్లు, 1 అర్జెంటీనా పౌరుడు, ఒక ఫ్రెంచ్ జాతీయుడు ఉన్నారని ఎయిర్‌పోర్ట్ అథారిటీ తెలిపింది.

ల్యాండిండ్ సమయంలో ప్లేన్ క్రాష్ అయ్యింది. వెంటనే విమానానికి మంటలు అంటుకున్నాయి. రెస్క్యూ టీం అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టింది.

''చాలా మంది ప్రయాణికులు బతికే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. బోర్డులో 68 మంది ప్రయాణికులు, నలుగురు సిబ్బంది ఉన్నారు... రెస్క్యూ జరుగుతోంది, ఎవరైనా ప్రాణాలతో ఉన్నారో లేదో మాకు తెలియదు," అని యతి ఏయిర్ లైన్స్ అధికారులు తెలిపారు.

First Published:  15 Jan 2023 1:41 PM IST
Next Story