Telugu Global
International

AI వల్ల రోడ్లపాలవుతున్న టెకీలు!

ఒక్క మే నెలలో నే AI సాంకేతికత కారణంగా దాదాపు 4,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు.మరిన్ని కంపెనీలు ఆ బాటలో పయనించడానికి అడుగులు వేస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపుకు అనేక కారణాలకు తోడుగా ఇప్పుడు కూడా AI వచ్చి చేరింది.

AI వల్ల రోడ్లపాలవుతున్న టెకీలు!
X

ప్రపంచంలో ప్రస్తుతం సంచలనం సృష్టిస్తున్న సాంకేతికత ఆర్టిఫిషియల్ ఇంటలీజన్స్ (AI ). చాట్‌జీపీటీ, బార్డ్‌, బింగ్ వంటి ఏఐ టూల్స్ లాంఛ్ అయిన తర్వాత టెకీల ప‌రిస్ధితి అద్వాన్నంగా తయారయ్యింది.

ఒక్క మే నెలలో నే AI సాంకేతికత కారణంగా దాదాపు 4,000 మంది తమ ఉద్యోగాలను కోల్పోయారు.మరిన్ని కంపెనీలు ఆ బాటలో పయనించడానికి అడుగులు వేస్తున్నాయి. ఉద్యోగుల తొలగింపుకు అనేక కారణాలకు తోడుగా ఇప్పుడు కూడా AI వచ్చి చేరింది.

ఖర్చు తగ్గింపు, కంపెనీలో పునర్నిర్మాణం లేదా విలీనాలతో పాటు AI కారణంగా ఒక్క మే నెలలోనే 80 వేల మంది ఉద్యోగాలు కోల్పోయారని తాజా రిపోర్టులు స్పష్టం చేస్తున్నాయి. పై అన్ని కారణాల వల్ల‌ జనవరి నుంచి మే వరకు దాదాపు 4 లక్షల మంది ఉపాధి కోల్పోయారు.

ఈ ఏడాది ఫిబ్రవరిలో, ఉద్యోగ సలహా వేదిక Resumebuilder.com నిర్వహించిన మరో సర్వేలో కొన్ని US ఆధారిత కంపెనీలు తమ సంస్థల్లో ఉద్యోగులకు బదులుగా ChatGPTని అమలు చేయడం ప్రారంభించాయని వెల్లడించింది.

సర్వేలో 1,000 మంది వ్యాపారవేత్తలు పాల్గొన్నారు. ఈ సర్వేలో పాల్గొన్న US కంపెనీల్లో దాదాపు సగం మంది తాము ChatGPTని ఉపయోగిస్తున్నామని, చాట్‌బాట్ తమ కంపెనీలలో ఉద్యోగులను భర్తీ చేసిందని చెప్పారు.

" చాలా మంది వ్యాపారవేత్తలు ChatGPT పని తీరును చూసి ముగ్ధులయ్యారు. 55 శాతం మంది ChatGPT పని నాణ్యత అద్భుతంగా ఉందని చెప్పగా, 34 శాతం మంది ఇది చాలా బాగుందని చెప్పారు." అని Resumebuilder తెలిపింది.

Resumebuilder.com చీఫ్ కెరీర్ అడ్వైజర్ స్టాసీ హాలర్ ఒక ప్రకటనలో... "ChatGPT వినియోగం గురించి వ్యాపారవేత్తలు చాలా ఉత్సాహంగా ఉన్నారు. ఈ కొత్త సాంకేతికత కార్యాలయాల్లో ఇప్పుడిప్పుడే పెరుగుతోంది కాబట్టి, ఉద్యోగులు తప్పనిసరిగా దీని గురించి ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఇది వారి ప్రస్తుత ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఉద్యోగుల స్థానంలో ChatGPTని రీ ప్లేస్ చేయాలని యజమానులు చూస్తున్నారు." అని తెలిపారు.

అంతేకాకుండా, ChatGPT సృష్టికర్త సామ్ ఆల్ట్‌మాన్ కూడా మార్చిలో ఒక ఇంటర్వ్యూలో చాట్‌జిపిటి వల్ల‌ కస్టమర్ సేవా రంగంలో ఉద్యోగుల అవసరం లేకుండా పోవచ్చన్నారు.

First Published:  4 Jun 2023 1:35 PM IST
Next Story