నస్రల్లా హతం..సురక్షిత ప్రాంతానికి ఇరాన్ సుప్రీం!
తాము జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. దీంతో ఇరాన్ అప్రమత్తమైంది. భద్రతా కారణాల రీత్యా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.
దక్షిణ లెబనాన్‌లోని దాహియాలోని నివాసగృహాల కింద భూగర్భంలో ఉన్న హెజ్‌బొల్లా ప్రధాన కార్యాలయంపై ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) భీకర వైమానిక దాడులు జరిపింది. ఈ మేరకు తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసింది. 'నస్రల్లా ఇక ఈ ప్రపంచాన్ని ఉగ్రవాదంతో భయభ్రాంతులకు గురిచేయలేడు' అని రాసుకొచ్చింది. అటు ఇజ్రాయెల్ వార్ రూమ్ దీనిపై స్పందిస్తూ.. 'ఆపరేషన్ న్యూ ఆర్డర్' మిషన్ విజయవంతమైనట్లు వెల్లడించింది.ఈ క్రమంలోనే తాము జరిపిన దాడుల్లో హెజ్‌బొల్లా చీఫ్ హసన్ నస్రల్లా హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించింది. ఇజ్రాయెల్-హెజ్‌బొల్లాల మధ్య జరుగుతున్న పోరుతో పశ్చిమాసియాలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఇజ్రాయెల్ దళాలు చేస్తున్న భీకరదాడులతో హెజ్‌బొల్లాకు భారీ నష్టం సంభవిస్తున్నది. తాజాగా ఆ గ్రూప్ చీఫ్ హసన్ నస్రల్లాను మట్టుబెట్టినట్లు తెలుస్తోంది.దీంతో ఇరాన్ అప్రమత్తమైంది. భద్రతా కారణాల రీత్యా ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని సురక్షిత ప్రాంతానికి తరలించినట్లు సమాచారం.
మరోవైపు సస్రల్లా మృతి చెందారనే వార్తల వేళ తదుపరి కార్యాచరణ విషయంలో హెజ్‌బొల్లా, ఇతర సంస్థలతో ఇరాన్ నిరంతర సంప్రదింపులు జరుపుతున్నట్లు విశ్వసనీయ వర్గాలను ఉటంకిస్తూ అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెలువడినాయి. హెజ్‌బొల్లాకు మొదటి నుంచి ఇరాన్ అండగా ఉన్నది. నస్రల్లా లక్ష్యంగా ఇజ్రాయెల్ భీకర దాడి చేస్తున్న సమయంలోనే ఇరాన్ సుప్రీం ఖమేనీ జాతీయ భద్రతా మండలిని తన నివాసంలో అత్యవసరంగా ఏర్పాటు చేశారు.
హెజ్‌బొల్లాకు అండగా నిలవండి.. ఖమేనీ పిలుపు
హెజ్‌బొల్లా చీఫ్ నస్రల్లా హతమైనట్లు ఇజ్రాయెల్ ప్రకటించిన వేళ ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీ ఓ ప్రకటన విడుదల చేశారు. లెబనాన్ పౌరులను చంపడాన్ని ఖండిస్తున్నానని, ఈ దాడులు ఇజ్రాయెల్ నేతల మూర్ఖపు విధానాలను రుజువు చేస్తున్నాయని విమర్శించారు. లెబనాన్‌లోని హెజ్‌బొల్లా కంచుకోటను ధ్వంసం చేసేంత స్థాయి ఇజ్రాయెల్‌కు లేదని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియా ప్రాంతంలోని అన్ని ప్రతిఘటన శక్తులు హెజ్‌బొల్లాకు అండగా నిలువాలని పిలపునిచ్చారు.