Telugu Global
International

ఎలన్‌ మస్క్‌ తో ప్రధాని మోదీ భేటీ

బ్లేయర్‌ హౌస్‌ లో సమావేశం

ఎలన్‌ మస్క్‌ తో ప్రధాని మోదీ భేటీ
X

టెస్లా సీఈవో ఎలన్‌ మస్క్‌ తో ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ భారత కాలమానం ప్రకారం రాత్రి 10 గంటల తర్వాత మస్క్‌ తో బ్లేయర్‌ హౌస్‌లో సమావేశమయ్యారు. భారత్‌ టెస్లా పెట్టుబడులు, స్టార్‌లింక్‌ ఇంటర్నెట్‌ సేవలపై చర్చించినట్టు సమాచారం. భారత కాలమానం తెల్లవారుజామున 2.30 గంటల సమయంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ తో ప్రధాని మోదీ సమావేశం కానున్నారు. ట్రంప్‌ రెండోసారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొదటిసారి మోదీ ఆయనతో భేటీ అవుతున్నారు.

First Published:  13 Feb 2025 11:12 PM IST
Next Story