Close Menu
Telugu GlobalTelugu Global
    Facebook X (Twitter) Instagram
    Facebook X (Twitter) Instagram YouTube
    Telugu GlobalTelugu Global
    Monday, September 22
    • HOME
    • NEWS
      • Telangana
      • Andhra Pradesh
      • National
      • International
    • EDITOR’S CHOICE
    • CINEMA & ENTERTAINMENT
      • Movie Reviews
    • HEALTH & LIFESTYLE
    • WOMEN
    • SPORTS
    • CRIME
    • ARTS & LITERATURE
    • MORE
      • Agriculture
      • Family
      • NRI
      • Science and Technology
      • Travel
      • Political Roundup
      • Videos
      • Business
      • English
      • Others
    Telugu GlobalTelugu Global
    Home»NEWS»International

    ఆస్ట్రేలియాలో ‘మిస్టరీ వస్తువు’.. చంద్రయాన్-3 శకలాలంటూ మీడియాలో ప్రచారం!

    By Telugu GlobalJuly 18, 20232 Mins Read
    ఆస్ట్రేలియాలో 'మిస్టరీ వస్తువు'.. చంద్రయాన్-3 శకలాలంటూ మీడియాలో ప్రచారం!
    Share
    WhatsApp Facebook Twitter LinkedIn Pinterest Email

    భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగంపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. రాకెట్ లాంచింగ్ విజయవంతం కావడంతో.. ఇక ఇప్పుడు అందరి ఆసక్తి దాని ప్రయాణంపైనే ఉన్నది. మరో నెల రోజుల్లో చంద్రుడిపై సాఫ్ట్ లాండింగ్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే, ఆస్ట్రేలియాలో చంద్రయాన్-3 మరో రకంగా వార్తల్లోకి ఎక్కింది. ఆస్ట్రేలియా బీచ్‌లో కనపడిన ఒక మిస్టరీ వస్తువే ఇందుకు కారణం. సముద్రంలో నుంచి ఒడ్డుకు కొట్టుకొని వచ్చిన ఒక వస్తువు.. చంద్రయాన్-3కి సంబంధించిన శకలంగా అక్కడ ప్రచారం జరుగుతోంది.

    భారత్ ప్రయోగించిన చంద్రయాన్-3ని నింగిలోకి ఎల్వీఎం రాకెట్ మోసుకెళ్లింది. దానికి సంబంధించిన దృశ్యాలు ఆస్ట్రేలియాలో కూడా కనపడ్డాయి. ఈ క్రమంలో ఒడ్డుకు కొట్టుకొని వచ్చిన శకలాలు చంద్రయాన్ రాకెట్‌కు చెందినవే అనే ప్రచారం జరుగుతోంది. ఈ శకలానికి చెందిన ఫొటోలను ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ ట్వీట్ చేసింది. ఇప్పటికే దీనికి సంబంధించిన దర్యాప్తు జరుగుతున్నట్లు తెలుస్తున్నది.

    ఈ శకలం విదేశాలకు చెందిన అంతరిక్ష ప్రయోగానికి సంబంధించినది అయి ఉండొచ్చని ఆస్ట్రేలియా అధికారులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే అనుమానం ఉన్న దేశాలకు కూడా ఆస్ట్రేలియా సమాచారం అందించింది. బీచ్‌లో పడి ఉన్న వస్తువు దగ్గరకు ఎవరూ వెళ్లకుండా భద్రత ఏర్పాటు చేసింది. అంతే కాకుండా.. దాన్ని తాకొద్దని, కదిలించ వద్దని ప్రజలను హెచ్చరించింది. ఇప్పటికే సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన ఫొటోలు వైరల్ అయ్యాయి. కొంత మంది ఒకడుకు ముందుకు వేసి.. ఈ శకలాన్ని ఇస్రో ప్రయోగించిన ఎల్వీఎం రాకెట్‌తో పోలుస్తున్నారు. ఇది ఇండియాకు చెందినదే అని వాదిస్తున్నారు. త్వరలోనే దీనికి సంబంధించిన మిస్టరీ వీడుతుందని ఆస్ట్రేలియా స్పేస్ ఏజెన్సీ సైంటిస్టులు తెలియజేస్తున్నారు.

    Last friday, people in Australia reported seeing a comet/UFO in the sky which turned out to be the LVM3 rocket that launched #Chandrayaan3.

    And now, the third stage of a PSLV rocket has washed ashore on the coast of Green Head, Western Australia! #ISRO pic.twitter.com/FFVwhooSyE

    — Debapratim (@debapratim_) July 17, 2023

    We are currently making enquiries related to this object located on a beach near Jurien Bay in Western Australia.

    The object could be from a foreign space launch vehicle and we are liaising with global counterparts who may be able to provide more information.

    [More in comments] pic.twitter.com/41cRuhwzZk

    — Australian Space Agency (@AusSpaceAgency) July 17, 2023

     

    Chandrayan 3 LVM
    Previous Articleమట్టి తల్లి (కవిత)
    Next Article ఇరాన్‌లో 66.7 డిగ్రీల ఉష్ణోగ్ర‌త న‌మోదు
    Telugu Global

    Keep Reading

    కాకతీయ కళాసంస్కృతి

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    అమెరికాలో వ్యాపిస్తున్న జాంబీ డీర్‌ డిసీజ్‌..

    మహిళలు తీసుకోవాల్సిన ముఖ్యమైన విటమిన్స్ ఇవే!

    Add A Comment
    Leave A Reply Cancel Reply

    Recent Articles

    కాకతీయ కళాసంస్కృతి

    March 30, 2025

    చలికాలంలో గర్భిణీ స్త్రీలు పాటించవల్సిన జాగ్రత్తలు ఏవంటే..

    March 30, 2025

    కాలి పిక్కలు పట్టేస్తున్నాయా.. ఇలా చేస్తే ప్రయోజనం ఉంటుంది..

    March 30, 2025

    పగిలిన పెదవులతో ఇబ్బందా .! ఇలా చెయ్యండి..

    March 30, 2025
    Don't Miss

    జీవితాన్ని ప్రతిక్షణం ఎంజాయ్ చేయాలంటే..

    August 20, 2024

    ఇప్పుడున్న బిజీ లైఫ్‌స్టైల్ కారణంగా జీవితాన్ని ఆస్వాదించే తీరిక ఎవరికీ ఉండట్లేదు. ఉరుకుల పరుగుల జీవితంలో మల్టీటాస్కింగ్‌ అవసరమే. కానీ, దీనివల్ల డబ్బు, హోదా వంటివి లభిస్తాయే కానీ, ఆనందం కాదు.

    ఇవి పాటిస్తే.. రిలేషన్‌షిప్‌లో హ్యాపీగా ఉండొచ్చు!

    August 20, 2024

    వదిన, ఇద్దరు పిల్లలను చంపి.. ఆపై ఆత్మహత్య.. ఇష్టం లేని పెళ్లి చేశారని టెకీ ఘాతుకం

    July 25, 2024
    Telugu Global
    Facebook X (Twitter) Instagram YouTube
    • Contact us
    • About us
    • Privacy Policy
    • Terms and Conditions
    • Grievance Redressal Form
    © 2025 TeluguGlobal.com. Designed with Love.

    Type above and press Enter to search. Press Esc to cancel.