ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలిస్తాం
క్రిస్మస్ వేళ ఉక్రెయిన్‌లోని విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా రష్యా భీకర దాడులు చేసిన క్రమంలో అమెరికా అధ్యక్షుడు నిర్ణయం
ఉక్రెయిన్‌కు మరిన్ని ఆయుధాలు ఇస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ పేర్కొన్నారు. క్రిస్మస్ వేళ ఉక్రెయిన్‌లోని విద్యుత్ కేంద్రాలే లక్ష్యంగా రష్యా భీకర దాడులు చేసిన క్రమంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ఈ నిర్ణయం తీసుకున్నారు. కీవ్‌కు మరిన్ని ఆయుధాలు అందించేలా రక్షణ శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఉక్రెయిన్ ప్రజలు చలి నుంచి రక్షణ పొందకుండా ఉండటమే రష్యా దాడి వెనుక ఉద్దేశమని బైడెన్ తెలిపారు. గ్రిడ్ వ్యవస్థను నాశనం చేసి వారికి విద్యుత్ సరఫరా అందకుండా మాస్కో కుట్ర పన్నిందని పేర్కొన్నారు. మరికొన్ని రోజుల్లో అధ్యక్ష పీఠం నుంచి వైదొలగనున్న బైడెన్ ఉక్రెయిన్‌కు వీలనైంత సాయం అందించాలని సంకల్పించారు. ఇప్పటికే 725 మిలియన్ డాలర్ల ప్యాకేజీ ప్రకటించగా.. దాని అదనంగా మరో 988 మిలియన్ డాలర్ల ఆయుధ సామాగ్రిని ఇస్తామని బైడెన్ కార్యకవర్గం హామీ ఇచ్చింది. అమెరికా నుంచి కీవ్‌కు 2022 నుంచి ఇప్పటివరకు 62 బిలియన్ డాలర్ల విలువైన ఆయుధాలు, ఇతర సాయం అందించారు.