Telugu Global
International

ట్విట్టర్లో మానిటైజేషన్.. ట్వీట్లకు డబ్బులే డబ్బులు

ఫేస్ బుక్ మానిటైజేషన్ లాగానే ట్విట్టర్ కూడా మానిటైజ్ అవుతోంది. తాము పెట్టిన కంటెంట్ నుంచి యూజర్లు డబ్బులు సంపాదించొచ్చు.

ట్విట్టర్లో మానిటైజేషన్.. ట్వీట్లకు డబ్బులే డబ్బులు
X

ఇప్పటి వరకు ట్వీట్లకు లైక్ లు, మెసేజ్ లు, రీ ట్వీట్లు మాత్రమే మనకు తెలుసు, ఇకపై ట్వీట్లకు డబ్బులు కూడా వస్తాయి. అవును, ట్విట్టర్లో మానిటైజేషన్ ఆప్షన్ ఇచ్చారు. ప్రస్తుతం ఈ ఆప్షన్ అమెరికాలో మాత్రమే యూజర్లకు అందుబాటులో ఉందని, త్వరలో ఇతర దేశాల్లో కూడా మానిటైజేషన్ తీసుకొస్తామని చెప్పారు ఎలన్ మస్క్.

యూజర్లకు డబ్బులే డబ్బులు..

ఫేస్ బుక్ మానిటైజేషన్ లాగానే ట్విట్టర్ కూడా మానిటైజ్ అవుతోంది. తాము పెట్టిన కంటెంట్ నుంచి యూజర్లు డబ్బులు సంపాదించొచ్చు. పెద్ద పెద్ద టెక్స్ట్ మెసేజ్ ల నుంచి, వీడియో కంటెంట్ ద్వారా డబ్బులు వస్తాయి. సెట్టింగ్స్ లోకి వెళ్లి మానిటైజ్ ఆప్షన్ క్లిక్ చేస్తే సరిపోతుంది.


12 నెలలు ఉచితంగా..

సోషల్ మీడియాలో మానిటైజేషన్ ద్వారా మనకు డబ్బులు రావాలంటే, ఆయా సంస్థలు కూడా వాటినుంచి కొంత మినహాయించుకుంటాయి. అయితే ట్విట్టర్లో రాబోయే 12 నెలలు మానిటైజేషన్ ద్వారా వచ్చే డబ్బుల్ని సంస్థ మినహాయించుకోదు అని చెబుతున్నారు మస్క్. ఆ తర్వాత ట్విట్టర్ కు ఆదాయంలో వాటా ఉంటుందని చెప్పకనే చెప్పారు.

కంటెంట్‌ ప్రమోషన్ ఇప్పటికే అందుబాటులో ఉంది. దీన్ని మరింతగా విస్తరించబోతున్నారు. తాజా మార్పుల ద్వారా కంటెంట్ క్రియేటర్లను ట్విట్టర్‌ వేదిక మీదకు తీసుకొచ్చేందుకు మస్క్‌ ప్రయత్నిస్తున్నారనేది టెకీల మాట. ఫేస్ బుక్ పోస్ట్ లు, యూట్యూబ్ పోస్ట్ లే కాదు, భవిష్యత్‌ లో ట్వీట్లు కూడా ఆదాయ వనరుగా మారతాయని తెలుస్తోంది. ఇప్పటికే పెయిడ్ ట్వీట్ల ద్వారా సెలబ్రిటీలు సంపాదిస్తున్నారు. ఇప్పుడు సామాన్య యూజర్లు కూడా తమ ట్వీట్లను ఆదాయ వనరుగా మార్చుకోవచ్చనమాట.

First Published:  14 April 2023 9:16 AM GMT
Next Story