Telugu Global
International

ఫేస్ బుక్ యూజర్లకు షాక్.. వెరిఫైడ్ దోపిడీ మొదలు

ఇతర ఆదాయాలవైపు దృష్టిపెట్టి ఇలా బ్లూ బ్యాడ్జ్ లకు బేరం పెట్టారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ఈ సేవలు మొదల్యయాయి. త్వరలో మిగతా దేశాలన్నిటిలో కూడా వెరిఫైడ్ బాదుడు అమలులోకి రాబోతోంది.

ఫేస్ బుక్ యూజర్లకు షాక్.. వెరిఫైడ్ దోపిడీ మొదలు
X

ట్విట్టర్లో వెరిఫైడ్ యూజర్ బ్లూటిక్ కోసం డబ్బులు వసూలు చేస్తున్నారంటే అందరూ మస్క్ ని తిట్టిపోశారు. మరీ ఇంత కక్కుర్తి అవసరమా అంటూ మండిపడ్డారు. ఫ్యాన్సీ రేటుకి ట్విట్టర్ని సొంతం చేసుకున్న మస్క్, ముందు ముందు ఇంకెన్ని షాకులిస్తాడోనంటూ భయపడ్డారు. ఆ భయం నిజమైంది, ఆ జాడ్యం అందరికీ అంటుకుంది. ఇప్పుడు ఫేస్ బుక్, ఇన్ స్టా కూడా వెరిఫైడ్ యూజర్ల దగ్గర నెలవారీ చందా వసూలు చేయడానికి సిద్ధమయ్యాయి. ఈ రెండిటి మాతృ సంస్థ మెటా నుంచి షాకింగ్ నిర్ణయాన్ని ప్రకటించారు సీఈఓ జుకర్ బర్గ్.

నెలకు వెయ్యి రూపాయలు..

ఫేస్ బుక్, ఇన్ స్టా లో వెరిఫైడ్ యూజర్లుగా చలామణి కావాలంటే ఇకపై నెలవారీ చందా 11.9 డాలర్లు చెల్లించాలి. అంటే అక్షరాలా మన కరెన్సీలో వెయ్యి రూపాయలు. నెలకు వెయ్యిరూపాయలంటే మాటలు కాదు అనే కామెంట్లు వినపడుతున్నాయి. కానీ వెరిఫైడ్ యూజర్ గా చలామణి అవ్వాలంటే ఆమాత్రం ఖర్చు పెట్టుకోవాలంటున్నారు మెటా నిర్వాహకులు.

ఫేస్ బుక్ కి ఆదాయం తగ్గడంతో ఆమధ్య 11వేలమంది ఉద్యోగులను ఇంటికి పంపించేశారు. ఇప్పుడు ఇతర ఆదాయాలవైపు దృష్టిపెట్టి ఇలా బ్లూ బ్యాడ్జ్ లకు బేరం పెట్టారు. ప్రస్తుతం ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో ఈ సేవలు మొదల్యయాయి. త్వరలో మిగతా దేశాలన్నిటిలో కూడా వెరిఫైడ్ బాదుడు అమలులోకి రాబోతోంది.

అందరూ అందరే..

సోషల్ మీడియా పేరుతో ముందుగా ప్రజలకు ఎరవేశారు. ఆ తర్వాత మెల్ల మెల్లగా అలవాటు చేసుకుని ఇప్పుడు డబ్బులు కట్టండి అంటూ డిమాండ్లు చేస్తున్నారు. యూట్యూబ్ ఆల్రడీ ప్రీమియం సేవలు మొదలు పెట్టింది. లేకపోతే యాడ్స్ తో చంపేస్తుంది. ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టా.. ఇలా అన్నీ ఇప్పుడు కమర్షియల్ గా మారిపోయాయి. అడ్వర్టైజ్ మెంట్లతో వచ్చే లాభాలు సరిపోక యూజర్లను గ్రేడ్లవారీగా విభజిస్తున్నాయి. బ్లూటిక్ తో వెరిఫైడ్ యూజర్ హోదా కావాలంటే మాత్రం విడివిడిగా అందరికీ చదివించుకోక తప్పదు. లేకపోతే సోషల్ మీడియాలో అనామక సాధారణ యూజర్ గా మిగిలిపోవాల్సిందే అనేంతగా సీన్ క్రియేట్ చేస్తున్నారు. ఎమోషనల్ బ్లాక్ మెయిల్ కి రంగం సిద్ధం చేశారు.

First Published:  20 Feb 2023 6:42 AM GMT
Next Story