Telugu Global
International

మేలో జనంలోకి తమిళ పులి!

ఎల్‌టీటీఈ ప్రభాకర్‌ జనజీవనంలోకి రానున్న తమిళ మీడియా కథనాలు

మేలో జనంలోకి తమిళ పులి!
X

శ్రీలంఖలో ఎల్‌టీటీఈ కథ ముగిసింది అని దశాబ్దంన్నర క్రితమే ప్రకటించిన అక్కడి పాలకులకు ముచ్చెమటలు పట్టించే కథనాలు తమిళ మీడియా ఇటీవల కాలంలో వరుసగా ప్రచురిస్తోంది. తమిళ పులి మే నెలలో జనంలోకి రాబోతున్నారని ప్రచారం జరుగుతోంది. శ్రీలంఖలో తమిళ ప్రత్యేక దేశం (తమిళ ఈలం) కోసం లిబరేషన్‌ టైగర్స్‌ ఆఫ్‌ తమిళ్‌ ఈలం (ఎల్‌టీటీఈ) స్థాపించి ఉద్యమాన్ని నడిపించిన వేలుపిళ్లై ప్రభాకర్‌ బతికే ఉన్నారని.. మే నెలలోనే ఆయన ఎంట్రీ ఇవ్వబోతున్నారని తమిళ మీడియా ప్రత్యేక కథనాలు ప్రచురించింది. ప్రభాకరన్‌ తమతో జరిగిన పోరాటంలో 2009 మే నెలలో చనిపోయాడని అక్కడి సైన్యం ప్రకటించింది. ఆయన మృతదేహం ఇదేనంటూ కొన్ని ఫొటోలను కూడా రిలీజ్‌ చేసింది. ఆ తర్వాత కొంతకాలానికి ఆయన చిన్న కుమారుడిని శ్రీలంఖ సైన్యం కాల్చిచంపిన వీడియోలు, ఫొటోలు కలకలం సృష్టించాయి. ప్రభాకర్‌ తో పాటు ఆయన కుటుంబం మొత్తం చనిపోయారని శ్రీలంఖ ప్రభుత్వం, అక్కడి సైన్యం ప్రకటించినా తమిళ ఈలం ఉద్యమకారులు మాత్రం ప్రభాకరన్‌ బతికే ఉన్నారని చెప్తూ వస్తున్నారు. ఈక్రమంలోనే ఆయన జనంలోకి రాబోతున్నారని తమిళ మీడియా కథనాలు ప్రచురించడం ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రభాకరన్‌ తో పాటు ఆయనకు రైట్‌ హ్యాండ్‌ గా చెప్పే పొట్టు అమ్మన్‌ కూడా మే నెలలోనే జనం ముందుకు రాబోతున్నారని సదరు కథనాల్లో వెల్లడించింది.

First Published:  28 Jan 2025 9:15 AM IST
Next Story