Telugu Global
International

రిషి సునాక్ విజయం.. భారత్ కి ఓ పాఠం

వైవిధ్యం పట్ల మనం ప్రదర్శించే గౌరవానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉందని, వచ్చే ఎన్నికల్లో అదే రీతిలో ఓటర్లు వైవిధ్యమైన తీర్పునివ్వబోతున్నారని చెప్పారు. ఎనిమిదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు ముగింపు పలికే రోజు దగ్గర్లోనే ఉందన్నారు జైరాం రమేష్.

రిషి సునాక్ విజయం.. భారత్ కి ఓ పాఠం
X

బ్రిటన్ లో రిషి సునాక్ విజయం భారత్ కి ఓ పాఠంగా మారుతుందని అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్. బ్రిటన్ నుంచి భారత్ వైవిధ్యాన్ని నేర్చుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. వైవిధ్యం పట్ల మనం ప్రదర్శించే గౌరవానికి ప్రపంచ వ్యాప్త గుర్తింపు ఉందని, వచ్చే ఎన్నికల్లో అదే రీతిలో ఓటర్లు వైవిధ్యమైన తీర్పునివ్వబోతున్నారని చెప్పారు. ఎనిమిదేళ్లుగా సాగుతున్న అరాచక పాలనకు ముగింపు పలికే రోజు దగ్గర్లోనే ఉందన్నారు జైరాం రమేష్.

భారత సంతతికి చెందిన రిషి సునాక్ బ్రిటన్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన వేళ కాంగ్రెస్ ఇలా స్పందించింది. మైనారిటీల నుంచి ఒకరిని అత్యున్నత పదవికి ఎన్నుకునే పద్ధతిని భారతీయులు కూడా ఆచరిస్తారని అన్నారు కేంద్ర మాజీ మంత్రి చిదంబరం. ఆమధ్య కమలా హ్యారిస్‌, ఇప్పుడు రిషి సునాక్.. ఇలా మెజారిటీయేతర వర్గాలనుంచి నేతల్ని అత్యున్నత స్థానాలకు ఎన్నుకోవడం సంతోషించదగ్గ విషయం అని చెప్పారు. అమెరికా, బ్రిటన్ వాసులు చారిత్రక తీర్పునిచ్చారని అన్నారు.

ప్రస్తుతం బారత్ లో మోదీ భజన తారా స్థాయికి చేరుకుంది. మోదీ చిరస్థాయిగా ప్రధానిగా ఉంటారని, ఆ తర్వాత ఆయన స్థానంలో మరో హిందూ నేత యోగి ఆదిత్యనాథ్ ప్రధాని అవుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. ఇలాంటి ఆధిపత్య భావజాలాన్ని ఆచరించే పార్టీలకు, అలాంటి నేతలకు, వారి వందిమాగధులకు బ్రిటన్ ఎన్నిక ఓ పాఠంలా మారుతుందని అన్నారు కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్. ప్రపంచంలోనే అత్యంత అరుదుగా బ్రిటిషర్లు వ్యవహరించారని, మైనారిటీ వర్గాలకు చెందిన వ్యక్తిని అత్యున్నత పదవికోసం ఎన్నుకున్నారని చెప్పారు. రిషి సునాక్‌ ఎదిగిన తీరును మనం వేడుకలా జరుపుకోవాలని అన్నారు శశిథరూర్.

First Published:  25 Oct 2022 1:05 PM GMT
Next Story