మస్క్, వివేక్ రామస్వామిలకు కీలక పదవి
ఈ ఇద్దరు అద్భుతమైన అమెరికన్లు కలసి వృథా ఖర్చులను తగ్గించి, ఫెడరల్ ఏజెన్సీలను పునర్నిర్మించి పరిపాలనకు మార్గం సుగమం చేస్తారని ట్రంప్
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో తనకు మద్దతుగా నిలిచిన ఎలాన్ మస్క్‌కు డొనాల్డ్ ట్రంప్ కీలక పదవి అప్పగించారు. గవర్నమెంట్ ఎఫీషియెన్సీ డిపార్ట్‌మెంట్‌కు ఆయనను హెడ్‌గా నియమించారు.ఆయనతో పాటు వివేక్ రామస్వామి కూడా హెడ్‌గా బాధ్యతలు నిర్వర్తించనున్నారు. అగ్రరాజ్యంలో నూతనంగా ఏర్పాటు కానున్న ట్రంప్ ప్రభుత్వంలో ఈ ద్వయం ఎఫిషియెన్సీ శాఖ బాధ్యతలు నిర్వహించనున్నారు. ఈ ఇద్దరు అద్భుతమైన అమెరికన్లు కలసి వృథా ఖర్చులను తగ్గించి, ఫెడరల్ ఏజెన్సీలను పునర్నిర్మించి పరిపాలనకు మార్గం సుగమం చేస్తారని ట్రంప్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ అధికార యంత్రాంగ ప్రక్షాళన, మితిమీరిన నిబంధనలకు కోత, అనవసర ఖర్చుల తగ్గింపు, ఫెడరల్ ఏజెన్సీల పునర్నిర్మాణం వంటి బాధ్యతలు నిర్వహిస్తారు. సేవ్ అమెరికా ఉద్యమానికి ఇవన్నీ ఎంతో ముఖ్యమైనవని పేర్కొన్నారు. రక్షణ శాఖ కార్యదర్శిగా పీట్ హెగ్సెత్‌ను ఎంపిక చేశారు. ఆయన ఫాక్స్ న్యూస్‌లో హోస్ట్‌గా పనిచేశారు. మాజీ స్పై జాన్ రాట్‌క్లిఫ్‌కు సీఐఐ చీఫ్‌గా అవకాశం ఇవ్వనున్నారు. మైక్ హక్‌అబీకి అంబాసిడర్‌గా బాధ్యతలు అప్పగించనున్నారు.