పుతిన్‌ను కలవనన్న కమలా హారిస్
అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే రష్యా-ఉక్రెయన్‌ల శాంతి చర్చల్లో భాగంగా పుతిన్ కలవబోనన్నఅమెరికా ఉపాధ్యక్షురాలు
అమెరికా అధ్యక్ష ఎన్నికలు నవంబర్‌లో జరగనున్నాయి. ఈ ఎన్నికల్లో డమోక్రటిక్ అభ్యర్థిగా ఆ దేశ ఉపాధ్యక్షురాలు కమలాహారీస్, రిపబ్లికన్ అభ్యర్థిగా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బరిలో ఉన్నారు. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ కొన్నిరోజులుగా హారిస్, ట్రంప్‌ల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. ఈ నేపథ్యంలోనే కమలా హారిస్ రష్యా అధ్యక్షుడు పుతిన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను అధ్యక్ష ఎన్నికల్లో గెలిస్తే రష్యా-ఉక్రెయన్‌ల శాంతి చర్చల్లో భాగంగా పుతిన్ కలవబోనని కుండబద్దలు కొట్టారు. రష్యా-ఉక్రెయిన్‌ల మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో చర్చల్లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను కలుస్తారా? అని ఓ ఇంటర్వ్యూలో అడిగిన ప్రశ్నకు హారిస్ ఈ విధంగా జవాబిచ్చారు.
ఉక్రెయిన్ లేకుండా ద్వైపాక్షిక చర్చలు కావు. ఉక్రెయిన్ భవిష్యత్తుపై ఆ దేశమే చెప్పాలని ఆమె పేర్కొన్నారు. అలాగే ఉక్రెయిన్‌పై రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్ విధానాలపై హారిస్ మండిపడ్డారు. ట్రంప్ అధ్యక్షుడిగా ఉండి ఉంటే పుతిన్ ప్రస్తుతం ఉక్రెయిన్‌లోని కీవ్‌లో అధికారాన్ని సాధించేవారు అన్నారు.