Telugu Global
International

జాన్సన్ బేబీ పౌడర్ లో క్యాన్సర్ కారకాలు - అమ్మకాలు నిలిపివేత

జాన్సన్స్ టాల్కం బేబీ పౌడర్ లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు తేలడంతో ఆ సంస్థపై వేలాది కేసులు నమోదవుతున్నాయి. ఈ కేసుల బాధలు తట్టుకోలేని కంపెనీ 2023 కల్లా ప్రపంచవ్యాప్తంగా బేబీ పౌడర్ అమ్మకాలు నిలిపివేస్తున్నట్టు ప్ర‌కటించింది.

జాన్సన్ బేబీ పౌడర్ లో క్యాన్సర్  కారకాలు - అమ్మకాలు నిలిపివేత
X

ప్రపంచవ్యాప్తంగా పేరొందిన జాన్సన్స్ టాల్కం బేబీ పౌడర్ లో క్యాన్సర్ కారకాలు ఉన్నట్టు తేలడంతో వస్తున్న కేసులను తట్టుకోలేక‌ ఆ పౌడర్ అమ్మకాలు ప్రపంచవ్యాప్తంగా ఆపేస్తున్నట్టు జాన్సన్ & జాన్సన్ సంస్థ ప్రకటించింది. అమెరికా, కెనడాల్లో 2020ల్లోనే ఈ ఉత్పత్తుల అమ్మకాలు ఆపేశారు. అయితే మిగతా చోట్ల 2023 లో ఆపేస్తున్నట్టు సంస్థ ప్ర‌కటించింది.



ఈ టాల్కం పౌడర్ లో ఆస్బెస్టాస్ ఉందని దానివల్ల అనేక మంది క్యాన్సర్ బారిన పడ్డారంటూ కంపెనీపై దాదాపు 38,000 కేసులు నమోదయ్యాయి. జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ప్రస్తుతం ఈ కేసులను కోర్టుల్లో ఎదుర్కొంటోంది.



అయితే జాన్సన్ అండ్ జాన్సన్ కంపెనీ ఈ ఆరోపణలను ఖండించింది, దశాబ్దాల శాస్త్రీయ పరీక్షలు ఈ పౌడర్ ఆస్బెస్టాస్-రహితమైనదిగా తేల్చాయి అని కంపెనీ పేర్కొంది. కానీ బేబీ పౌడరును పరీక్షించగా ఆస్బెస్టాస్‌ పాజిటివ్‌ అని తేలినట్టు అమెరికా అధికారులు చెప్తున్నారు.అయితే కేసుల బాధలు భరించలేని జాన్సన్ కంపెనీ ఈ పౌడర్ అమ్మకాలు నిలిపేయాలని నిర్ణయించింది.





First Published:  12 Aug 2022 1:43 PM IST
Next Story