Telugu Global
International

చెత్త ఎత్తే పోటీల గురించి తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఆటల పోటీలు జరుగుతుంటాయి. అయితే వాటన్నింటి కంటే జపాన్‌లో జరిగే ‘స్పోగోమీ’ అనే పోటీ మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇవి చెత్త ఎత్తే పోటీలు.

చెత్త ఎత్తే పోటీల గురించి తెలుసా?
X

ప్రపంచవ్యాప్తంగా రకరకాల ఆటల పోటీలు జరుగుతుంటాయి. అయితే వాటన్నింటి కంటే జపాన్‌లో జరిగే ‘స్పోగోమీ’ అనే పోటీ మాత్రం చాలా ప్రత్యేకం. ఎందుకంటే ఇవి చెత్త ఎత్తే పోటీలు. ఇవెలా ఉంటాయంటే..

ప్రపంచంలో పర్యావరణానికి మేలు చేసే ఆట ఏదైనా ఉందంటే అది స్పోగోమీ మాత్రమే. జపాన్‌లో 2008 నుంచి స్పోగోమీ ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. ‘స్పోగోమీ’ అంటే ‘స్పోర్ట్ అండ్ గోమీ’ అని అర్థం. ‘గోమీ’ అంటే జపనీస్‌ భాషలో ‘చెత్త’ అని అర్థం. చెత్తను సేకరించడం కోసం ప్రతి ఏటా జపాన్‌లో పెద్ద ఎత్తున స్పోగోమీ పోటీలు జరుగుతాయి. పర్యావరణాన్ని కాపాడేందుకు, సముద్రాలు, నగరాలు కలుషితం కాకుండా ఉండేందుకు ఈ ఆటను డిజైన్ చేశారు.

స్పోగోమీ పోటీల్లో ముగ్గురు నుంచి ఐదుగురి వరకూ టీంగా ఉంటారు. అరవై నిముషాల టైం లిమిట్‌లో ఎంత చెత్తను సేకరిస్తే అన్ని పాయింట్లు ఇస్తారు. అయితే చెత్త రకాన్ని బట్టి కూడా పాయింట్లు మారుతుంటాయి. అంటే కాగితాల చెత్తతో పోలిస్తే.. సిగరెట్ పీకలకు ఎక్కువ పాయింట్లు ఇస్తారన్న మాట.

ఈ గేమ్స్ ఏడాదిలో చాలా సార్లు జరుగుతాయి. స్పోగోమీ పోటీల కోసం ప్రపంచం నలుమూలల నుంచి ఎన్నో టీమ్స్ జపాన్ వస్తాయి. అయితే ఈ గేమ్ ఆడేవాళ్లంతా రివార్డులకోసమో, మెడల్స్ కోసమో ఆడరు. ఆట రూపంలో పర్యావరణానికి మేలు చేసే ఈ కాన్సెప్ట్ నచ్చి ఇందులో పార్టిసిపేట్ చేస్తారు. ‘చెత్త ఎత్తడాన్ని, పరిసరాలను క్లీన్ చేయడాన్ని ఒక ఆటగా తీసుకోవాలి’ అని చెప్పడమే ఈ పోటీల ఉద్దేశం.

First Published:  14 Jun 2024 6:00 AM IST
Next Story