Telugu Global
International

ఇరాన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి

ఇజ్రాయెల్‌ చర్యను ఖండించిన సౌదీ అరేబియా..మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రికత్తలపై ఆందోళన

ఇరాన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ దాడి
X

ఈ ఏడాది అక్టోబర్‌ 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ 250 బాలిస్టిక్‌ క్షిపణులతో దాడి చేసిన ఘటనకు ప్రతీకారంగా నెతన్యాహు సైన్యం ఇరాన్‌పై దాడులు చేసింది. తెల్లవారుజామున ఇరాన్‌పై వైమానిక దాడులతో విరుచుకుపడింది. ఇరాన్‌కు చెందిన సైనిక స్థావరాలతో పాటు, క్షిపణీ తయారీ కేంద్రాలపై దాడులు జరిపింది. ఇరాన్‌ క్షిపణులతో తమ పౌరులకు తక్షణ ముప్పు పొంచి ఉండటం వల్లనే వాటిని ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్‌ సైన్యం వెల్లడించింది. ప్రస్తుతానికి ఇరాన్‌పై తమ దాడి ముగించినట్లు ఇజ్రాయెల్‌ ప్రతినిధి హగారి తెలిపారు. ఇరాన్‌తో పాటు ఆ దేశ మద్దతుదారులు అక్టోబర్‌ 7 నుంచి కనికరం లేకుండా దాడులు చేస్తున్నట్లు ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. ప్రపంచంలోని అన్ని సార్వభౌమదేశాల మాదిరిగానే ఇజ్రాయెల్‌కు ప్రతిస్పందించే హక్కు, బాధ్యత ఉంటుందన్నారు. తమ ప్రజలను రక్షించుకోవడానికి ఏదైనా చేస్తామన్నారు. ఇజ్రాయెల్‌కు హాని తలపెట్టాలని చూస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.

ఈ దాడులపై ఇరాన్‌ స్పందించింది. తమ దేశానికి చెందిన ఇలామ్‌, టెహ్రాన్‌, ఖుజెస్థాన్‌ ప్రాంతాలను ఐడీఎఫ్‌ లక్ష్యంగా చేసుకున్నదని తెలిపింది. ఈ దాడిలో పరిమిత స్థాయిలోనే నష్టం వాటిల్లిందని చెప్పింది. ఈ దాడుల్లో ఇద్దరు సైనికులు మృతి చెందారని వెల్లడించింది. ఇరాన్‌ సైనిక స్థావరాలే లక్ష్యంగా దాడి చేసిన ఇజ్రాయెల్‌ చర్యను సౌదీ అరేబియా ఖండించింది. తాజా దాడులతో మధ్యప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రికత్తలపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ పరిస్థితి ఇజ్రాయెల్‌ను హెచ్చరించింది.

First Published:  26 Oct 2024 2:32 PM IST
Next Story