లెబనాన్‌లో విధ్వంసం సృష్టిస్తున్న ఇజ్రాయెల్
52 మంది మృతి.. 72 మందికి గాయాలు
ఇజ్రాయెల్-హెజ్‌బొల్లాల మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో తాజాగా లెబనాన్‌పై టెల్‌అవీవ్ విరుచుకుపడింది. ఈశాన్య లెబనాన్‌పై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల్లో 52 మంది మృతి చెందినట్లు ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
లెబనాన్‌లోని బెకా వ్యాలీపై ఇజ్రాయెల్ వైమానిక దాడులు చేసింది. ఈ దాడుల సమయంలో ఆ ప్రాంతంలోని ప్రజలు తప్పించుకోవడానికి యత్నించినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో 52 మంది మృతి చెందగా.. 72 మంది గాయపడ్డారు. మరోవైపు దాడుల కారణంగా దక్షిణ బీరుట్‌లోని దహియేలో కూడా పలు భవనాలు ధ్వంసమైనట్లు సమాచారం. అయితే, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా.. ఇజ్రాయెల్‌పై హెజ్‌బొల్లా రాకెట్ దాడులు చేసింది. ఈ దాడుల్లో సుమారు 11 మంది గాయపడినట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడిస్తున్నాయి.
మరో హమాస్ నేతను హతమార్చిన ఇజ్రాయెల్
మరోవైపు హమాస్‌కు చెందిన సీనియర్ అధికారి ఇజ్ అల్ దిన్ కసబ్‌ను మట్టుబెట్టినట్లు ఐడీఎఫ్ పేర్కొన్నది. గాజా స్ట్రిప్‌లోని ఇతర సమూహాలను కసబ్ సమన్వయం చేయడానికి బాధ్యత వహిస్తుంటాడని తెలిపింది. కసబ్ మరణానికి పాలస్తీనా అధికారులు సంతాపం తెలిపారు. ఎన్‌క్లేవ్‌లో తమ కారుపై టెల్‌అవీవ్ జరిపిన దాడుల్లో అమాన్‌అయేష్ అనే హమాస్ అధికారితో పాటు కసబ్ మృతి చెందినట్లు వెల్లడించింది.
పశ్చిమాసియాకు మరింత సైనిక సామాగ్రిని పంపిన అమెరికా
అమెరికా పశ్చిమాసియాకు మరింత సైనిక సామాగ్రిని పంపింది. ఇరాన్‌కు హెచ్చరికగా అదనపు సైనిక సంపత్తిని తరలిస్తామని అగ్రరాజ్యం పేర్కొన్నది. బాలిస్టిక్ క్షిపణులను విధ్వంసం చేసే మిషన్లు, దీర్ఘశ్రేణి బీ2 బాంబర్ ఎయిర్ క్రాఫ్ట్ అందులో ఉంటాయని వెల్లడించింది. అమెరికా పౌరులను ఇరాన్, దాని ప్రా క్సీలు లక్ష్యంగా చేసుకుంటే ప్రతి అంశాన్ని లెక్కలోకి తీసుకొని మా ప్రజలు రక్షించుకుంటామని పెంటగాన్ అధికారి ప్రతినిధి మేజర్ జనరల్ పాట్ రైడర్ తెలిపారు.