Telugu Global
International

వైఎస్సార్‌ మరణాన్ని గుర్తుచేసిన ఇరాన్ అధ్యక్షుడి మృతి

ఇరాన్ రెస్క్యూ టీమ్ హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి వెళ్లింది. నిన్నటి నుంచి రైసీ కోసం దట్టమైన అటవీప్రాంతంలో ముమ్మర గాలింపు చేపట్టింది. దాదాపు 15 గంటలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు.

వైఎస్సార్‌ మరణాన్ని గుర్తుచేసిన ఇరాన్ అధ్యక్షుడి మృతి
X

ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ హెలికాప్టర్ ప్రమాదంలో దుర్మరణం చెందారు. ఇబ్రహీం రైసీ సహా హెలికాప్టర్‌లో ప్ర‌యాణిస్తున్న 9మంది మృతిచెందారు. ఇరాన్‌-అజర్‌బైజాన్‌ సరిహద్దుల్లో కిజ్‌ కలాసి, ఖొదావరిన్‌ పేరుతో రెండు డ్యామ్‌లను రెండు దేశాలు సంయుక్తంగా నిర్మించాయి. ఆదివారం అజర్‌బైజన్ ప్రెసిడెంట్‌ ఇల్హమ్‌ అలియేవ్‌తో కలిసి ఇబ్రహీం రైసీ రెండు డ్యామ్‌లను ప్రారంభించారు. తర్వాత విదేశాంగ మంత్రి హుస్సెన్ అమీర్ అబ్దుల్లా హియన్‌, ఈస్ట్‌ అజర్‌బైజన్ ప్రావిన్సు గవర్నర్, తబ్రిజ్‌ ప్రావిన్స్‌ ఇమామ్‌లతో కలిసి తబ్రిజ్‌ టౌన్‌కు హెలికాప్టర్‌లో బయలుదేరారు. బయల్దేరిన అరగంటకే రైసీ ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ వాతావరణం అనుకూలించక అటవీ ప్రాంతంలో కూలిపోయింది.

సమాచారం అందిన వెంటనే ఇరాన్ రెస్క్యూ టీమ్ హెలికాప్టర్ కూలిన ప్రదేశానికి వెళ్లింది. నిన్నటి నుంచి రైసీ కోసం దట్టమైన అటవీప్రాంతంలో ముమ్మర గాలింపు చేపట్టింది. దాదాపు 15 గంటలు రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించారు. అక్కడ ఎవరూ బతికి లేరనీ, హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయిందనే నిర్ధారణకు వచ్చారు. హెలికాఫ్టర్ కూలిన ఫొటోలను కూడా విడుదల చేశారు. ఇరాన్, ఇజ్రాయెల్ ఉద్రిక్తతల నేపథ్యంలో హెలికాప్టర్ ప్రమాదం చర్చనీయాంశంగా మారింది. రైసీ మ‌ర‌ణం ఉమ్మ‌డి ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రిగా ప‌నిచేసిన డాక్ట‌ర్ వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి మ‌ర‌ణాన్ని గుర్తుచేసింది.

First Published:  20 May 2024 5:10 AM GMT
Next Story