Telugu Global
International

వరల్డ్‌ 100 బెస్ట్ కంపెనీస్‌ లిస్ట్‌.. ఇండియా నుంచి ఒక్క కంపెనీకే చోటు..!

అల్ఫాబెట్‌, మెటా కంపెనీలు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో ఇన్ఫోసిస్‌ 64వ స్థానంలో నిలిచింది. ఇండియా నుంచి టాప్‌-100లో చోటు దక్కించుకున్న ఏకైక సంస్థగా ఇన్ఫోసిస్‌ నిలిచింది.

వరల్డ్‌ 100 బెస్ట్ కంపెనీస్‌ లిస్ట్‌.. ఇండియా నుంచి ఒక్క కంపెనీకే చోటు..!
X

దేశీయ ఐటీ సేవల దిగ్గజం ఇన్ఫోసిస్‌ అరుదైన ఘనత సాధించింది. ప్రపంచంలోనే 100 బెస్ట్ కంపెనీల్లో చోటు దక్కించుకుంది. వ‌ర‌ల్డ్ టాప్‌-100లో ఇండియా నుంచి ఏకైక కంపెనీగా ఘ‌న‌త సాధించింది. 2023లో ప్రపంచంలోనే వంద అత్యుత్తమ కంపెనీల జాబితాను టైమ్స్‌ మ్యాగజైన్ విడుదల చేసింది. ఈ జాబితాలో మైక్రోసాఫ్ట్‌ టాప్‌ ప్లేసు దక్కించుకుంది.

అల్ఫాబెట్‌, మెటా కంపెనీలు వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఈ జాబితాలో ఇన్ఫోసిస్‌ 64వ స్థానంలో నిలిచింది. ఇండియా నుంచి టాప్‌-100లో చోటు దక్కించుకున్న ఏకైక సంస్థగా ఇన్ఫోసిస్‌ నిలిచింది. ఇక ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్న 750 కంపెనీల జాబితాను టైమ్స్ తాజాగా విడుదల చేసింది. రెవెన్యూ గ్రోత్, సోషల్ అండ్ కార్పొరేట్ గవర్నెన్స్ ఆధారంగా ఈ కంపెనీల ర్యాంకింగ్స్‌ను ప్రకటించింది.

ఇన్ఫోసిస్‌తోపాటు మరో 7 ఇండియన్‌ కంపెనీలు టాప్‌ 750లో చోటు దక్కించుకున్నాయి. విప్రో లిమిటెడ్ 174వ స్థానంలో, మహీంద్రా గ్రూప్ 210వ స్థానంలో, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ 248వ స్థానంలో, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్ లిమిటెడ్ 262 స్థానంలో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ 418 స్థానంలో, WNS గ్లోబల్ సర్వీసెస్ 596వ స్థానంలో, ఐటీసీ లిమిటెడ్ 672 స్థానంలో నిలిచాయి. ఇక ఇదే టైంలో ఇన్ఫోసిస్‌ ప్రపంచంలో టాప్‌-3 ప్రొఫెషనల్‌ సర్వీస్ కంపెనీలలో ఒకటిగా నిలిచింది.

First Published:  16 Sept 2023 12:31 AM IST
Next Story