భారత్, చైనా లో జనాభా తగ్గుదలపై ఎలాన్ మస్క్ ఏమన్నారంటే?
ఇది ప్రపంచం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటి అని అభిప్రాయపడ్డ మస్క్
చైనా, భారత్ సహా ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో జనాభా క్షీణతపై అపర కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఆందోళన వ్యక్తం చేశారు. ఇది ప్రపంచం ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన సవాళ్లలో ఒకటి అని అభిప్రాయపడ్డారు.
జనాభా క్షీణత అంచనాకు సంబంధించిన ఓ గ్రాఫ్‌ను టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ 'ఎక్స్' లో పోస్టు చేసింది. నైజీరియా, అమెరికా, ఇండోనేషియా, పాకిస్థాన్, భారత్, చైనా సహా కొన్ని దేశాల్లో 2018-2100 మధ్య జనాభాలో ఎలాంటి మార్పులు ఉండనున్నాయనే దాన్ని అందులో పేర్కొన్నారు. ముఖ్యంగా అత్యంత జనాభా కలిగిన దేశాలుగా గుర్తింపు పొందిన భారత్, చైనా లో 2100నాటికి క్షీణత అధికంగా ఉంటుందని అందులో అంచనా వేశారు. ఈ గ్రాఫ్‌ను పోస్ట్ చేస్తూ.. 'జనాభా తగ్గుదల మానవాళికి అత్యంత ముప్పు... ఎలాన్ మస్క్' అని టెస్లా ఓనర్స్ సిలికాన్ వ్యాలీ తన పోస్టులో పేర్కొన్నది. దీనికి మస్క్ స్పందిస్తూ.. 'అవును' అని రాసి ఆ గ్రాఫ్‌ను రీపోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్టు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.