Telugu Global
International

భారత్ లో 7.3% శాతం ప్రజల వద్ద క్రిప్టో కరెన్సీ... ఇది ప్రమాదకర పరిణామమన్న UN

క్రిప్టో కరెన్సీ వల్ల భారత్ సహా ప్రపంచ దేశాలకు ముప్పు ఉందని ఐక్యరాజ్య సమితి హెచ్చరించింది. భారత్ లో 7.3 శాతం ప్రజలు క్రిప్టో కరెన్సీ ని వినియోగిస్తున్నారని UN ఓ నివేదికలో పేర్కొంది.

భారత్ లో 7.3% శాతం ప్రజల వద్ద క్రిప్టో కరెన్సీ... ఇది ప్రమాదకర పరిణామమన్న UN
X

భారత దేశంలో 7.3 శాతం ప్రజల వద్ద క్రిప్టో కరెన్సీ ఉందని ఐక్య రాజ్యసమితి నివేదిక తెలిపింది. క్రిప్టొ కరెన్సీ అధికంగా కలిగిన 20 దేశాల్లో 15 అభివృద్ది చెందుతున్న దేశాలే ఉన్నాయని UN వాణిజ్య, అభివృద్ధి సంస్థ UNCTAD తెలిపింది.

12.7 శాతంతో ఉక్రెయిన్ అగ్రస్థానంలో ఉండగా, రష్యా 11.9 శాతం, వెనిజులా 10.3 శాతం, సింగపూర్9.4 శాతం, కెన్యా 8.5 శాతం, అమెరికా 8.3 శాతం, భారత్ 7.3శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి.

"కోవిడ్ మహమ్మారి సమయంలో అభివృద్ధి చెందుతున్న దేశాలతో సహా ప్రపంచ వ్యాప్తంగా క్రిప్టో-కరెన్సీల వినియోగం విపరీతంగా పెరిగింది" అని UNCTAD తెలిపింది.

క్రిప్టో కరెన్సీ వల్ల కొందరు విపరీతంగా లాభపడ్డారని, నగదు బదిలీకి దీనిని సాధనంగా కూడా వినియోగిస్తున్నారని తెలిపిన నివేదిక ద్రవ్యోల్భణం ముప్పును ఎదుర్కొనేందుకు క్రిప్టో కరెన్సీ ఉపయోగపడుతుందని ముదుపరులు భావిస్తున్నారని ఐక్యరాజ్యసమితి తెలిపింది. అయితే ఈ కరెన్సీ వల్ల సామాజిక నష్టాలున్నాయని, ఈ కరెన్సీలు దేశాల సార్వభౌమాధికారానికే ముప్పని UN పేర్కొంది. ఈ కరెన్సీని నియంత్రించడానికి ఒక వేళ కేంద్ర బ్యాంకులు రంగంలోకి దిగితే మరింత పెద్ద సమస్యగా మారుతుందని నివేదిక అభిప్రాయపడింది.

First Published:  11 Aug 2022 1:40 PM IST
Next Story