శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూరియా
ప్రమాణ స్వీకారం చేయించిన అధ్యక్షుడు అరుణ కుమార దిసనాయకే
శ్రీలంక ప్రధానిగా హరిణి అమరసూరియా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. సిరిమావో బండారునాయకే తర్వాత 24 ఏళ్లకు శ్రీలంక ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. శ్రీలంక రాజధాని కొలంబోలో నిర్వహించిన కార్యక్రమంలో నేషనల్ పీపుల్స్ పవర్ (ఎన్‌పీపీ) ఆమెతో ప్రమాణ స్వీకారం చేయించారు. సోషియాలజీ లెక్చరర్ గా పని చేసిన హరిణి అమరసూరియా లింగ వివక్ష, మైనార్టీ హక్కులపై పలు ఉద్యమాలు చేశారు. ఆమె రెండోసారి శ్రీలంఖ పార్లమెంట్ సభ్యురాలిగా విజయం సాధించారు. ప్రధానితో పాటు పలు కీలక మంత్రిత్వ శాఖలకు అధ్యక్షుడు ఆమె చేతిలో పెట్టారు. న్యాయ, విద్య, కార్మిక, పరిశ్రమలు, సైన్స్ అండ్ టెక్నాలజీ, హెల్త్, ఇన్వెస్ట్‌మెంట్ శాఖలను ఆమె నిర్వర్తించనున్నారు. హరిణితో పాటు ఎన్‌పీపీ ఎంపీలు విజిత హేరత్, లక్ష్మణ్ నిపుణరచ్చి కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు.