Telugu Global
International

అంతరిక్షం నుంచి స్వాతంత్ర శుభాకాంక్షలు..

నాసా స్పేస్ స్టేషన్ పై భారత జాతీయ జెండా, అమెరికన్ జెండాలు ఉన్న ఫొటోలను కూడా ఆయన జత చేశారు. అంతరిక్షం నుంచి వచ్చిన ఈ సందేశాన్ని భారతీయులకు చేరవేస్తున్నట్టు తెలిపారు రాజా చారి.

అంతరిక్షం నుంచి స్వాతంత్ర శుభాకాంక్షలు..
X

భారత స్వాతంత్ర వజ్రోత్సవాల వేళ.. భారత సంతతికి చెందిన నాసా శాస్త్రవేత్త రాజా చారి ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఆయన తాత ముత్తాతలు మహబూబ్ నగర్ కి చెందినవారు. హైదరాబాద్ తో వారికి ప్రత్యేక అనుబంధం ఉంది. ఈ విషయాలను వివరిస్తూ.. నాసా స్పేస్ స్టేషన్ నుంచి హైదరాబాద్ ఇలా ఉంటుంది అంటూ ఓ ఫొటోను ఆయన తన ట్వీట్ కి జోడించారు. నాసా స్పేస్ స్టేషన్ పై భారత జాతీయ జెండా, అమెరికన్ జెండాలు ఉన్న ఫొటోలను కూడా ఆయన జత చేశారు. అంతరిక్షం నుంచి వచ్చిన ఈ సందేశాన్ని భారతీయులకు చేరవేస్తున్నట్టు తెలిపారు రాజా చారి.

అరుదైన సందేశం..

స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా భారతీయులకు ఎంతోమంది శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే నాసా నుంచి వచ్చిన ఈ అరుదైన సందేశం మాత్రం ఎంతో ప్రత్యేకం. భారత సంతతి అమెరికన్ అంతరిక్ష శాస్త్రవేత్త రాజాచారి ఈ శుభాకాంక్షలను భారతీయులకు అందించారు. గతేడాది నవంబర్ లో నాసా అంతరిక్ష కేంద్రానికి వెళ్లిన రాజాచారి, ఆరు నెలల అనంతరం భూమికి తిరిగొచ్చారు. ఇక్కడి వాతావరణానికి తగ్గట్టు తమ శరీరంలో జరుగుతున్న మార్పులను ఆయన ఎప్పటికప్పుడు ట్విట్టర్ ద్వారా ప్రజలకు తెలియజేస్తుంటారు. నాసా కార్యక్రమాల గురించి పలు ఆసక్తికర అంశాలను కూడా ఆయన ప్రస్తావిస్తుంటారు.

భారత స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా రాజాచారి విడుదల చేసిన వీడియో సందేశాన్ని అమెరికాలోని ఇండియన్ ఎంబసీ ట్వీట్ చేసింది. ఆయనకు కృతజ్ఞతలు తెలిపింది. తాజాగా ఆయన నాసా నుంచి తీసిన ఫొటోలను జతచేశారు. అంతరిక్షం నుంచి చూస్తే హైదరాబాద్ ఎలా ఉంటుందనే ఫొటోని జతచేస్తూ ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు అందరినీ ఆకట్టుకుంటోంది.

First Published:  15 Aug 2022 5:45 AM GMT
Next Story