మనిషికి పంది గుండె అమరిక.. రెండోరోజుకే హుషారుగా..
అతను ప్రస్తుతం స్పందిస్తున్న తీరుతో ఆశ్చర్యానికి గురైనట్లు వైద్యులు వెల్లడించారు. అనారోగ్య కారణాలు, హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా సంప్రదాయ పద్ధతిలో గుండె మార్పిడి కుదరకపోవడం వల్ల పంది గుండెను అమర్చినట్లు వైద్యులు వివరించారు.
అనారోగ్య కారణాలు, హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా ప్రాణాలకు ముప్పు ఏర్పడిన వ్యక్తిని కాపాడేందుకు వైద్యులు చివరి ప్రయత్నంగా అతనికి సర్జరీ చేసి పంది గుండె అమర్చిన విషయం తెలిసిందే. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ మేరీలాండ్ వైద్యులు ఈ కీలకమైన అవయవ మార్పిడి శస్త్ర చికిత్స చేశారు. సంబంధిత వ్యక్తికి జన్యు మార్పిడి చేసిన పంది గుండెను అమర్చారు. ఈ సర్జరీ చేసిన రెండు రోజులకే అతను సరదాగా జోకులు వేస్తున్నాడని వైద్యులు చెబుతున్నారు. 58 ఏళ్ల వయసు కలిగిన అతను కుర్చీలోనూ కూర్చోగలిగాడని చెప్పారు. అయితే.. రానున్న కొన్ని వారాలు అత్యంత క్లిష్టమైనవని ఈ సందర్భంగా వైద్యులు వివరించారు.
అయితే.. అతను ప్రస్తుతం స్పందిస్తున్న తీరుతో ఆశ్చర్యానికి గురైనట్లు వైద్యులు వెల్లడించారు. అనారోగ్య కారణాలు, హార్ట్ ఫెయిల్యూర్ కారణంగా సంప్రదాయ పద్ధతిలో గుండె మార్పిడి కుదరకపోవడం వల్ల పంది గుండెను అమర్చినట్లు వైద్యులు వివరించారు. గత ఏడాది ఇదే వర్సిటీ వైద్యుల బృందం ప్రపంచంలోనే తొలిసారిగా జన్యుపరంగా మార్పిడి చేసిన పంది గుండెను డేవిడ్ బెన్నెట్ అనే వ్యక్తికి అమర్చింది. అయితే చికిత్స జరిగిన రెండు నెలల తర్వాత అతడు ప్రాణాలు కోల్పోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో రానున్న రోజులు అత్యంత క్లిష్టమైనవని వైద్యులు చెబుతున్నారు.