Telugu Global
International

Elon Musk | ఎల‌న్‌మ‌స్క్ వ్య‌క్తిగ‌త సంప‌ద రూ.1.64 ల‌క్ష‌ల కోట్లు లాస్‌.. కార‌ణ‌మిదేనా..? ఇంకా..!!

Elon Musk | షేర్ల ప‌త‌నంతో కుబేరుల వ్య‌క్తిగ‌త సంప‌ద ప‌త‌నం కేవ‌లం ఎల‌న్‌మ‌స్క్‌కు మాత్ర‌మే ప‌రిమితం కాలేదు. అమెరికా టెక్నాల‌జీ సంస్థ‌ల అధినేత‌లు కూడా త‌మ‌ వ్య‌క్తిగ‌త సంప‌ద కోల్పోయారు.

Elon Musk | ఎల‌న్‌మ‌స్క్ వ్య‌క్తిగ‌త సంప‌ద రూ.1.64 ల‌క్ష‌ల కోట్లు లాస్‌.. కార‌ణ‌మిదేనా..? ఇంకా..!!
X

Elon Musk | ఎల‌న్‌మ‌స్క్ వ్య‌క్తిగ‌త సంప‌ద రూ.1.64 ల‌క్ష‌ల కోట్లు లాస్‌.. కార‌ణ‌మిదేనా..? ఇంకా..!!

Elon Musk | అమెరికాలోనే అతిపెద్ద ఎల‌క్ట్రిక్ కార్ల కంపెనీ టెస్లా (Tesla) సీఈఓ ఎల‌న్‌మ‌స్క్ (Elon Musk) గురువారం ఒక్క‌రోజే 20.3 బిలియ‌న్ డాల‌ర్ల (భార‌త క‌రెన్సీలో రూ.1.64 ల‌క్ష‌ల కోట్ల పైచిలుకు) వ్య‌క్తిగ‌త సంప‌ద కోల్పోయారు. అమెరికాలో వ‌డ్డీరేట్లు ఇలాగే పెంచితే ఎల‌క్ట్రిక్ కార్ల సేల్స్ పెంచుకోవ‌డానికి ధ‌ర‌లు త‌గ్గిస్తామ‌ని ఎల‌న్‌మ‌స్క్ చేసిన ప్ర‌క‌ట‌న‌.. ఇన్వెస్ట‌ర్ల‌లో సెంటిమెంట్ బ‌ల‌హీన ప‌డింది. గురువారం ట్రేడింగ్‌లో టెస్లా షేర్ విలువ 9.7 శాతం ప‌త‌న‌మై 269.90 డాల‌ర్ల‌కు చేరుకుంది. గ‌త ఏప్రిల్ 20 త‌ర్వాత టెస్లా షేర్ భారీగా ప‌త‌నం కావ‌డం ఇదే మొద‌టి సారి.

ఫ‌లితంగా ఎల‌న్‌మ‌స్క్ వ్య‌క్తిగ‌త సంప‌ద 20.3 బిలియ‌న్ డాల‌ర్లు త‌గ్గి, 234.4 బిలియ‌న్ డాల‌ర్ల‌కు ప‌డిపోయింది. ఇప్ప‌టికీ ప్ర‌పంచంలోనే అత్యంత కుబేరుడిగా కొన‌సాగుతున్నా.. రెండో స్థానంలో ఉన్న ల‌గ్జ‌రీ వ‌స్తువుల త‌యారీ సంస్థ ఎల్వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ అర్నాల్ట్ కంటే ఎల‌న్‌మ‌స్క్ వ్య‌క్తిగ‌త సంప‌ద‌ 33 బిలియ‌న్ డాల‌ర్లు మాత్ర‌మే ఎక్కువ‌.

షేర్ల ప‌త‌నంతో కుబేరుల వ్య‌క్తిగ‌త సంప‌ద ప‌త‌నం కేవ‌లం ఎల‌న్‌మ‌స్క్‌కు మాత్ర‌మే ప‌రిమితం కాలేదు. అమెరికా టెక్నాల‌జీ సంస్థ‌ల అధినేత‌లు కూడా త‌మ‌ వ్య‌క్తిగ‌త సంప‌ద కోల్పోయారు. అమెజాన్ డాట్ కామ్ అధినేత జెఫ్ బెజోస్‌, ఒరాకిల్ కార్పొరేష‌న్ చీఫ్ ల్యారీ ఎల్లిష‌న్‌, మైక్రోసాఫ్ట్ మాజీ సీఈఓ స్టీవ్ బాల్మెర్‌, మెటా సీఈఓ మార్క్ జుక‌ర్‌బ‌ర్గ్‌, గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ కో పౌండ‌ర్లు ల్యారీ పేజ్‌, సెర్జెయి బ్రిన్ కూడా 20.8 బిలియ‌న్ డాల‌ర్ల వ్య‌క్తిగ‌త సంప‌ద కోల్పోయారు. అమెరికాలోని స్టాక్ మార్కెట్‌లో నాస్‌డాక్-100లో టెక్ ఇండెక్స్ 2.3 శాతం న‌ష్ట‌పోయింది. ఒరాకిల్‌, అమెజాన్‌, మైక్రోసాఫ్ట్‌, మెటా, గూగుల్ త‌దిత‌ర సంస్థ‌లు టెక్ ఇండెక్స్‌లో భాగ‌స్వాములు.

జూన్‌తో ముగిసిన త్రైమాసికంలో టెస్లా నిక‌ర లాభాలు నాలుగేండ్ల క‌నిష్ట స్థాయికి ప‌డిపోయిన నేప‌థ్యంలో వ‌డ్డీరేట్లు పెరిగితే.. కార్ల ధ‌ర‌లు పెంచ‌క త‌ప్ప‌ద‌న్నారు ఎల‌న్‌మ‌స్క్‌. మున్ముందు మ‌రింత షాక్‌లు తినాల్సి వ‌స్తుంద‌నే సంకేతాలిచ్చారు. ఎల్‌వీఎంహెచ్ అధినేత బెర్నార్డ్ అర్నాల్ట్ వ్య‌క్తిగ‌త సంప‌ద 39 బిలియ‌న్ డాల‌ర్లు పెరిగింది. 2023లో పారిస్ కేంద్రంగా ప‌ని చేస్తున్న ఎల్‌వీఎంహెచ్ 26 శాతం పెరిగింది. గ‌త నెల‌లో బెర్నార్డ్ అర్నాల్ట్‌కు చెందిన ఎల్వీఎంహెచ్ షేర్ 2.6 శాతం న‌ష్ట‌పోయింది. దీంతో అర్నార్ట్ బెర్నాల్ట్‌ను దాటేసి ఎల‌న్‌మ‌స్క్.. ప్ర‌పంచంలోనే అతిపెద్ద కుబేరుడిగా అవ‌త‌రించారు.

First Published:  21 July 2023 3:12 PM IST
Next Story