కుబేరుల జాబితాలో మళ్లీ ఫస్ట్ ప్లేస్‌కి మస్క్
ఇటీవల జరిగిన టెస్లా సాధారణ వార్షిక సమావేశంలో మస్క్ వేతన ప్యాకేజీకి ఆమోద ముద్ర పడింది. 56 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని ఇచ్చేందుకు ఇన్వెస్టర్లు అంగీకరించారు.
టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ప్రపంచ కుబేరుల జాబితాలో మళ్లీ మొదటి స్థానానికి చేరుకున్నారు. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్ ఇండెక్స్ తాజా నివేదికలో ఈ విషయం వెల్లడించింది. టెస్లా షేర్లు రాణించడంతో మస్క్ మళ్లీ ఫస్ట్ ప్లేస్‌లో నిలిచారు. ఈ నివేదిక ప్రకారం.. మస్క్ 208 బిలియన్ డాలర్ల నికర విలువతో బెజోస్‌ను వెనక్కి నెట్టి మొదటి స్థానానికి చేరుకున్నారు. 205 బిలియన్ డాలర్లతో జెఫ్ బెజోస్, 199 బిలియన్ డాలర్లతో బెర్నార్డ్ ఆర్నాల్డ్ వరుసగా తర్వాతి స్థానాల్లో నిలిచారు. ప్రపంచ కుబేరుల జాబితాలో టాప్ ప్లేస్ కోసం చాలా కాలం నుంచి ఈ ముగ్గురి మధ్య గట్టి పోటీ నడుస్తోంది. తాజాగా టెస్లా షేర్లు రాణించడం మస్క్‌ను ఫస్ట్ ప్లేస్‌లో నిలిపింది.
ఇటీవల జరిగిన టెస్లా సాధారణ వార్షిక సమావేశంలో మస్క్ వేతన ప్యాకేజీకి ఆమోద ముద్ర పడింది. 56 బిలియన్ డాలర్ల వేతన ప్యాకేజీని ఇచ్చేందుకు ఇన్వెస్టర్లు అంగీకరించారు. దీంతో టెస్లా షేర్లు రాణించాయి. పే ప్యాకేజీపై పోరాటం, ఫ్రాన్స్‌లో ముందస్తు ఎన్నికలు, టెక్–స్టాక్ ర్యాలీ కారణంగా మస్క్ సంపద బాగా పెరిగింది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వెంచర్ ఎక్స్‌ఏఐకి 24 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిధులు వచ్చి చేరడం కూడా ఆయనకు కలిసొచ్చింది. ఇక బ్లూమ్‌బర్గ్ నివేదిక ప్రకారం మస్క్‌కు కంపెనీలో 65 శాతం వాటా ఉంది.