తైవాన్‌ను వణికిస్తున్న భూకంపం
తైవాన్ ప్రజలను భూకంపం మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. భూకంప ధాటికి అక్కడి వస్తువులన్నీ చెల్లాచెదురై పోయాయి. భూకంప తీవ్రత 7.2గా నమోదైంది.
తైవాన్‌ను భారీ భూకంపం వణికించింది. స్విమ్మింగ్ పూల్ సడెన్‌గా షేక్ అయింది. దీంతో అసలు ఏం జరిగిందో అర్థంకాక జనం భయంతో కంపించిపోయారు. కొన్ని భవనాలు కుప్పకూలిపోయాయి. ఆ భవనాల్లో జనం ఉన్నారా? ఉంటే ఎంతమంది ఉన్నారు.. అనే విషయం ఇంకా తెలియలేదు. ప్రాణ నష్టం ఎంత జరిగింది అనే దానిపై ఎలాంటి సమాచారం తెలియలేదని అధికారులు చెబుతున్నారు. ఒకసారి కాదు రెండు సార్లు కాదు.. ఒకేరోజులో ఏకంగా 12 సార్లు భూమి కంపించింది. భూకంప ధాటికి వాహనాలు విరిగిపోయాయి. వస్తువులన్నీ చెల్లాచెదురుగా పడిపోయాయి.
తైవాన్ ప్రజలను భూకంపం మరోసారి ఆందోళనకు గురిచేస్తోంది. దీంతో ప్రజలు హడలెత్తిపోతున్నారు. భూకంప ధాటికి అక్కడి వస్తువులన్నీ చెల్లాచెదురై పోయాయి. భూకంప తీవ్రత 7.2గా నమోదైంది. ఇళ్లలోని వస్తువులన్నీ ఊగిపోయాయి. సముద్ర తీరంలో 10 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. ప్రజలు హాహాకారాలు చేస్తూ వీధుల్లో పరుగులు పెడుతున్నారు. ప్రాణ భయంతో ఇళ్లలో నుంచి ప్రజలు బయటికి వచ్చేశారు. ఇంకా ఇళ్లలో ఎంతమంది ఉన్నారోనని ఆందోళనకు గురవుతున్నారు. ప్రాణాలు దక్కించుకోవడానికి భవనాలకు దూరంగా పరుగులు పెడుతున్నారు.