నేపాల్‌లో భూకంపం
రిక్టర్ స్కేల్‌పై 6.1 గా నమోదు
BY Raju Asari28 Feb 2025 10:00 AM IST

X
Raju Asari Updated On: 28 Feb 2025 1:03 PM IST
నేపాల్‌లో తెల్లవారుజామున భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై దాని తీవ్రత 6.1గా నమోదైంది. ఖాట్మండు లోయ చుట్టు పక్క ప్రాంతాల్లో భూకంపనలు సంభవించాయి. భాగ్‌మతి ప్రాంతంలో భూకంప కేంద్రం ఉన్నట్లు అధికారులు తెలిపారు. నేపాల్‌లో సరిహద్దు కలిగిన బీహార్‌లోని పలు జిల్లాలోనూ కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది. సమస్తిపూర్, పాట్నా, గోపాల్‌గంజ్, సరంజ్, పశ్చిమ చంపారన్, తూర్పు చంపారన్ జిల్లాల్లో భూప్రకంపనలు సంభవించినట్లు బీహార్ అధికారులు తెలిపారు. రిక్టార్ స్కేల్‌పై దాని తీవ్రత 5. 1గా నమోదైనట్లు వెల్లడించారు. భూకంపం కారణంగా ప్రాణ, ఆస్తినష్టం జరిగినట్లు సమాచారం లేదు.
Next Story