Telugu Global
International

సూడాన్‌లో హాస్పిటల్‌పై డ్రోన్‌ దాడి

30 మంది మృతి చెందారని మీడియా కథనాలు

సూడాన్‌లో హాస్పిటల్‌పై డ్రోన్‌ దాడి
X

సూడాన్‌లోని ఒక హాస్పిటల్‌ పై డ్రోన్‌ దాడి జరిగిందని.. ఈ ఘటనలో 30 మంది ప్రాణాలు కోల్పోయారని ఇంటర్నేషనల్‌ మీడియా తన కథనాల్లో వెల్లడించింది. సూడాన్‌లోని దార్ఫర్‌ ఏరియాలోని ఎల్‌ - ఫషేర్‌ లో గల హాస్పిటల్‌పై భారీ డ్రోన్‌తో ఎటాక్‌ చేశారని.. ఈ పేలుడు దాటికి 30 మంది ప్రాణాలు కోల్పోగా పలువురు తీవ్రంగా గాయపడ్డారని మీడియా రిపోర్ట్‌ చేసింది. సూడాన్‌ పై పట్టు కోసం ఆ దేశ ఆర్మీ, పారా మిలటరీ ర్యాపిడ్‌ సపోర్ట్‌ ఫోర్స్‌ బలగాలు పరస్పరం తలపడుతున్నాయి. పది నెలలుగా ఈ అంతర్యుద్ధం కంటిన్యూ అవుతోంది. హాస్పిటల్‌ పై దాడికి పాల్పడింది ఎవరో తేలాల్సి ఉంది. ఇప్పటి వరకు దాడి చేసింది తామేనని ఏ గ్రూప్‌ కూడా ప్రకటించలేదు.

First Published:  25 Jan 2025 6:29 PM IST
Next Story