ఇస్కాన్‌పై నిషేధానికి ఢాకా హైకోర్టు నో
హిందూ సంస్థ కార్యకాలాపాలపై నిషేధం విధించాలన్న పిటిషనర్ వాదనను తోసిపుచ్చిన హైకోర్టు
ఇస్కాన్‌పై నిషేధించడానికి బంగ్లాదేశ్‌లోని ఢాకా హైకోర్టు నిరాకరించింది. ఇటీవల చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల నేపథ్యంలో హిందూ సంస్థ కార్యకాలాపాలపై నిషేధం విధించాలన్న పిటిషనర్ వాదనను హైకోర్టు తోసిపుచ్చింది. అయితే దేశంలో ఇస్కాన్ ఇటీవలి కార్యకలాలపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకున్నదో నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.
మరోవైపు ఇస్కాన్ తీవ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నదని, దీనిపై నిషేధం విధించాలని పది మందితో కూడిన సుప్రీంకోర్టు న్యాయమూర్తుల బృందం అక్కడి ప్రభుత్వానికి లీగల్ నోటీసు పంపించింది. ఇటీవలి ఘర్షణల్లో ఓ న్యాయవాది మరణానికి కారణహైన వారిని విచారించాలని డిమాండ్ చేసింది. అయితే ఇస్కాన్ హిందూ మతానికి చెందిన సంస్థ అని, దాని కార్యకలాపాలపై దృష్టి పెట్టినట్లు బంగ్లాదేశ్ ప్రభుత్వం ఢాకా హైకోర్టుకు ఇటీవల తెలిపింది.
బంగ్లాదేశ్ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై చిన్మయ్ కృష్ణదాస్ ప్రభును ఢాకా పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసిన సంగతి తెలిసిందే. దీన్నివ్యతిరేకిస్తూ అక్కడి హిందువులు పెద్ద ఎత్తున నిరసనలు చేపడుతున్నారు. అయితే గతంలో ఇస్కాన్‌లో క్రియాశీలంగా ఉన్న చిన్నయ్.. క్రమశిక్షణా చర్యల్లో భాగంగా అన్ని పదవులకు దూరమైనట్లు తెలుస్తోంది.