క్రూజ్‌లో కోవిడ్ కలకలం.. - 800 మంది ప్రయాణికులకు కోవిడ్ పాజిటివ్
ఈ మెజెస్టిక్ ప్రిన్సెస్ క్రూజ్ షిప్‌లో 12 రోజుల సముద్రయానం మధ్యలో భారీగా కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. అది ఏకంగా 800 మందికి అని తెలియడంతో క్రూజ్‌లో ఉన్నవారు, అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
కోవిడ్ అదుపులోకి వచ్చిందని, ఇక భయపడాల్సిందేమీ లేదని భావిస్తున్న తరుణంలో ఎక్కడో ఒకచోట ఏదో ఒక ఉదంతం బయటపడుతూ ఆందోళనకు గురిచేస్తుంది.. కలవరం రేపుతుంది. తాజాగా న్యూజిలాండ్‌కు చెందిన ఓ క్రూజ్ నౌకను ఆస్ట్రేలియాలోని సిడ్నీ తీరంలో నిలిపివేశారు. దీనికి కారణం.. మొత్తం 4,600 మంది ప్రయాణికులు, సిబ్బందితో వెళుతున్న ఈ క్రూజ్‌లో 800 మంది కోవిడ్ పాజిటివ్ బాధితులు ఉండటమే.
ఈ మెజెస్టిక్ ప్రిన్సెస్ క్రూజ్ షిప్‌లో 12 రోజుల సముద్రయానం మధ్యలో భారీగా కోవిడ్ కేసులు వెలుగు చూశాయి. అది ఏకంగా 800 మందికి అని తెలియడంతో క్రూజ్‌లో ఉన్నవారు, అధికారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. దీంతో ఈ క్రూజ్‌ను సిడ్నీ తీరంలో నిలిపివేశారు. కోవిడ్ పాజిటివ్ ఉన్నవారిని ఐసోలేషన్‌లో ఉంచి, తగిన సదుపాయాలు కల్పిస్తున్నారు. క్రూజ్ ఆపరేటర్ సంస్థ `కార్నివాల్-ఆస్ట్రేలియా.. ఈ విషయాన్ని వెల్లడించింది. ఈ క్రూజ్ త్వరలోనే మెల్‌బోర్న్ చేరుకోనుంది.
2020లో ప్రపంచ మంతటా కోవిడ్ విస్తరించిన సమయంలోనూ ఇలాంటి ఘటనే ఈ సంస్థ నిర్వహిస్తున్న ఓ `రూబీ ప్రిన్సెస్ క్రూజ్`లో వెలుగుచూసింది. అప్పట్లో 900 మంది కోవిడ్ బారిన పడగా.. వారిలో 28 మంది మరణించారు. ఆస్ట్రేలియాలో ప్రస్తుతం కోవిడ్ కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. వారంలో 19,800 కేసులు వెలుగు చూశాయంటే.. అక్కడ పరిస్థితి ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు.