మగువల లోదుస్తులకు మగ మోడల్స్.. కారణం ఇదే..!
ఈ ఐడియా సూపర్ సక్సెస్ కావడంతో ఇన్నర్ వేర్స్ కంపెనీలు అన్ని మేల్ మోడల్స్ తో ప్రమోషన్స్ చేయడం మొదలుపెట్టాయి. సన్నగా, నాజుగ్గా ఉన్న మేల్ మోడల్స్ ని ఎంపిక చేసుకొని మీసాలు, గడ్డాలు తీసి ఇన్నర్ వేర్స్ ధరింపచేసి యాడ్స్ తీస్తున్నారు.
గతంలో లో దుస్తులకు ప్రత్యేకంగా యాడ్స్, ప్రమోషన్స్ వంటివి ఉండేవి కావు. రాను రాను జెంట్స్, లేడీస్ ఇన్నర్ వేర్స్‌కు కూడా ప్రమోషన్స్ చేయడం మొదలుపెట్టారు. ముఖ్యంగా లేడీస్ ఇన్నర్ వేర్స్‌కు సంబంధించిన యాడ్స్ మరీ అభ్యంతరకరంగా మారాయి. ఆ యాడ్స్ లో అశ్లీలత ఎక్కువైంది. ఇంట్లో అందరూ కలిసి టీవీ చూస్తున్నప్పుడు అటువంటి యాడ్స్ వస్తే చూడటం చాలా ఇబ్బందికరం.
మోడళ్లను కాసిన్ని దుస్తుల్లో అసభ్యంగా చూపడంపై విమర్శలు ఉన్నాయి. మన దేశమే కాదు ప్రపంచమంతటా లోదుస్తులకు సంబంధించి యాడ్స్ అదేవిధంగా ఉంటున్నాయి. ఇటువంటి యాడ్స్ ని కట్టడి చేయడంపై ఏ దేశాలు పట్టించుకోకున్నా చైనా ప్రభుత్వం మాత్రం గట్టి చర్యలు చేపట్టింది. ఆన్‌లైన్‌లో అమ్మాయిల లోదుస్తుల ప్రకటనలతో అశ్లీలత పెరుగుతోందని విమర్శలు రావడంతో చైనా ప్రభుత్వం ఒక కొత్త కండీషన్ తీసుకువచ్చింది. ఇకపై ఇన్నర్ వేర్స్ యాడ్స్ లో అమ్మాయిలు కనిపించకూడదని ఆదేశాలు ఇచ్చింది. దీంతో ఇన్నర్ వేర్స్ విక్రయించే వ్యాపారస్థులు కంగుతున్నారు.
అమ్మాయిలు లేకుండా లోదుస్తులకు యాడ్స్ చేయడం ఎలా..? అని ఆలోచించారు. ముందుగా అమ్మాయిల బొమ్మలకు లోదుస్తులు వేయించి ప్రమోషన్స్ చేయడం మొదలుపెట్టారు. అయితే అది అంతగా సక్సెస్ కాలేదు. ఆ తర్వాత మేల్ మోడల్స్ కు లేడీస్ ఇన్నర్ వేర్స్ ధరింపచేసి ప్రమోషన్లు చేయడం మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్లు వెరైటీగా ఉండటంతో యాడ్స్ జనంలోకి బాగా వెళ్లాయి.
ఈ ఐడియా సూపర్ సక్సెస్ కావడంతో ఇన్నర్ వేర్స్ కంపెనీలు అన్ని మేల్ మోడల్స్ తో ప్రమోషన్స్ చేయడం మొదలుపెట్టాయి. సన్నగా, నాజుగ్గా ఉన్న మేల్ మోడల్స్ ని ఎంపిక చేసుకొని మీసాలు, గడ్డాలు తీసి ఇన్నర్ వేర్స్ ధరింపచేసి యాడ్స్ తీస్తున్నారు. క్లీన్ సేవ్ చేసినా రఫ్ గా కనిపిస్తే ముఖానికి మాస్కులు పెట్టించి యాడ్స్ తీస్తున్నారు. విచిత్రంగా ఈ యాడ్స్ చైనా జనానికి విపరీతంగా నచ్చాయి. ఇప్పుడు చైనాలో ఎక్కడ చూసినా ఇటువంటి యాడ్సే కనిపిస్తున్నాయి. చైనా ప్రభుత్వం అశ్లీలత ఎక్కువ అవుతోందని కఠిన నిర్ణయం తీసుకున్నప్పటికీ వ్యాపార సంస్థలు మాత్రం తెలివిగా ఆలోచించి తమ బ్రాండ్లను జనంలోకి తీసుకెళ్తున్నాయి.