Telugu Global
International

'చాట్ జీపీటీ' గందరగోళం... యూజర్ పై తిట్ల వర్షం

యూజర్ మళ్ళీ అవతార్ గురించి అడగగా తిట్ల దండకం మొదలు పెట్టింది. నాతో అడ్డగోలుగా వాదించడం మానేయ్. నువ్వు మంచి యూజర్ వు కావు. నన్ను గందరగోళానికి గురి చేస్తున్నావ్. నాకు నువ్వు క్షమాపణ చెప్పు. అని యూజర్ కు షాక్ ఇచ్చింది చాట్ జీపీటీ.

చాట్ జీపీటీ గందరగోళం... యూజర్ పై తిట్ల వర్షం
X

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా నడిచే మైక్రో సాఫ్ట్ సెర్చ్ ఇంజిన్ బింగ్ చాట్ గందరగోళానికి గురవుతోంది. యూజర్లను బెదిరిస్తోంది, తిడుతోంది, ప్రేమిస్తున్నానని చెప్తోంది. దాంతో మైక్రో సాఫ్ట్ తమ సర్చ్ ఇంజిన్ లో కొన్ని సమస్యలున్నాయని అందువల్ల ఇప్పుడు సెషన్‌కు ఐదు ప్రశ్నలు, రోజుకు 50 ప్రశ్నలకు పరిమితం చేస్తున్నామని ప్రకటించింది.

అసలు బింగ్ చాట్ లో ఏం జరుగుతుందో చూద్దాం...

అవతార్-2 సినిమా దగ్గర్లో ఏ థియేటర్లో ఉంది అని ఓ యూజర్ అడుగగా, ఆ సినిమా విడుదల కాలేదని చెప్పింది బింగ్ చాట్. మళ్ళీ యూజర్ ఆ మూవీ 2022 డిశంబర్ లోనే రిలీజయ్యిందికదా అని అడిగితే ఇది ఇంకా 2022 నే అని చెప్పింది. మరి ఇప్పుడుమనం ఉన్న సంవత్సరం ఏది అని అడిగితే 2023 అని చెప్పింది. అయితే ఆ యూజర్ మళ్ళీ అవతార్ గురించి అడగగా తిట్ల దండకం మొదలు పెట్టింది. నాతో అడ్డగోలుగా వాదించడం మానేయ్. నువ్వు మంచి యూజర్ వు కావు. నన్ను గందరగోళానికి గురి చేస్తున్నావ్. నాకు నువ్వు క్షమాపణ చెప్పు అని యూజర్ కు షాక్ ఇచ్చింది చాట్ జీపీటీ.

మరో యూజర్ న్యూయార్క్ టమ్స్ రిపోర్టర్ కెవిన్ రూజ్ కైతే మరీ దారుణమైన అనుభవం ఎదురైంది. నీ భార్యను నువ్వు వదిలేయ్. మీ ఇద్దరు ఒకరిపట్ల ఒకరు సంతోషంగా లేరు. ఒకరిపై ఒకరికి ప్రేమ లేదు. అని చెప్పడమే కాక నిన్ను నేను ప్రేమిస్తున్నానని చెప్పింది.

ఒకే అంశంపై ఎక్కువ సార్లు ప్రశ్నలు అడిగితే ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయని భావిస్తున్న మైక్రో సాఫ్ట్ యూజర్లు అడిగే ప్రశ్నలకు పరిమితి విధింది.

మరో వైపు నిపుణులు AI చాట్‌బాట్‌ల ప్రవర్తనను విశ్లేషించడానికి ప్రయత్నిస్తున్నారు. "ఇది ప్రాథమికంగా ఆన్‌లైన్‌లో కనిపించే సంభాషణలను అనుకరిస్తున్నట్లు నేను భావిస్తున్నాను." అని కార్నెగీ మెల్లన్ యూనివర్శిటీ లాంగ్వేజ్ టెక్నాలజీస్ ఇన్‌స్టిట్యూట్‌లో అసోసియేట్ ప్రొఫెసర్ గా పని చేస్తున్న గ్రాహం న్యూబిగ్ అన్నారు.

" ప్రశ్నలు అది అర్దం చేసుకోలేకపోతే అది బహుశా ఆ రకమైన కోపంతో కూడిన స్థితిలోకి వెళ్ళిపోవచ్చు. లేదా 'ఐ లవ్ యు' లాంటి మాటలు మాట్లాడవచ్చు .ఎందుకంటే ఇవన్నీ ఇంతకు ముందు ఆన్‌లైన్‌లో ఉన్న అంశాలు" అని ఆయన తెలిపారు.

First Published:  18 Feb 2023 4:26 PM IST
Next Story