అమెరికా రాష్ట్రం కాలిఫోర్నియాలో బర్డ్ ఫ్లూ కలకలం సృష్టిస్తున్నది. 34 మందికి వైరస్ సోకింది. దాంతో రాష్ట్రంలో ఎమర్జెన్సీ విధిస్తున్నట్లు గవర్నర్ ప్రకటించారు. దక్షిణ కాలిఫోర్నియాలోని డెయిరీ ఫాంలోని ఆవుల్లో ఈ కేసులను గుర్తించారు. దాంతో వైరస్ వ్యాప్తిని అరికట్టడానికి చర్యలు తీసుకుంటున్నామని గవర్నర్ గవిన్ న్యూసమ్ వెల్లడించారు. అయితే ఒక వ్యక్తి నుంచి మరో వ్యక్తికి ఈ వైరస్ సంక్రమించిన దాఖలాలు లేవని తెలిపారు. ఇప్పటివరకు వైరస్ బారినపడినవారు ఆ డెయిర్ ఫాం దగ్గరలో ఉన్, పనిచేసిన వ్యక్తులేనని అన్నారు. బర్డ్ ఫ్లూతో సాధారణ ప్రజలకు ముప్పేమీ లేదని సీడీఎస్ వెల్లడించింది.
Previous Articleరెండేళ్లలో ఎస్ఎల్బీసీ టన్నెల్ పనులు పూర్తి
Next Article రాహుల్ నెట్టేశారు.. బీజేపీ ఎంపీలు నన్ను బెదిరించారు
Keep Reading
Add A Comment