బ్రిక్స్ విస్తరణకు గ్రీన్ సిగ్నల్.. కొత్తగా ఆరు దేశాలకు ఎంట్రీ..!
2001లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్‌కు చెందిన ఎకానమిస్టు జిమ్ ఓ నీల్ ఫస్ట్ టైం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలకు బ్రిక్ అనే వర్డ్ ఉపయోగించారు.
బ్రిక్స్ విస్తరణకు కూటమి సభ్యదేశాలు ఒకే చెప్పాయి. ఈ మేరకు సౌతాఫ్రికాలోని జొహన్నస్‌బర్గ్‌లో జరుగుతున్న 15వ బ్రిక్స్ సదస్సులో ఏకాభిప్రాయానికి వచ్చాయి. ఇందులో భాగంగా కూటమిలోకి కొత్తగా ఆరు దేశాలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు సౌతాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రామఫోసో. ప్రస్తుతం కూటమిలో బ్రెజిల్, రష్యా, భారత్, చైనా, దక్షిణాఫ్రికా ఉన్నాయి. కొత్తగా ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, అర్జెంటీనా, యునైటెడ్ అరబ్ ఎమిరెట్స్ దేశాలు కూటమిలో చేరతాయన్నారు. ఈ దేశాల సభ్యత్వం వచ్చే ఏడాది జనవరి 1 నుంచి అమల్లోకి వస్తుందన్నారు. దాదాపు 40కిపైగా దేశాలు బ్రిక్స్ కూటమిలో చేరేందుకు ఆసక్తి చూపుతున్నాయన్నారు.
2001లో ఇన్వెస్ట్‌మెంట్ బ్యాంక్ గోల్డ్‌మన్ శాక్స్‌కు చెందిన ఎకానమిస్టు జిమ్ ఓ నీల్ ఫస్ట్ టైం బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనాలకు బ్రిక్ అనే వర్డ్ ఉపయోగించారు. అప్పటికి ఈ నాలుగు దేశాలు వేగంగా అభివృద్ధి చెందుతున్న మధ్య ఆదాయ దేశాలు. 2050 నాటికి ప్రపంచానికి ఈ బ్రిక్ దేశాలు నేతృత్వం వహించగలవని ఆయన అంచనా వేశారు. 2006లో ఈ నాలుగు దేశాలు బ్రిక్ కూటమి ఏర్పాటు చేయాలని నిర్ణయించాయి. 2010లో సౌతాఫ్రికా కూడా కూటమిలో చేరడంతో కూటమి పేరు బ్రిక్స్‌గా మారింది.
ప్రస్తుతం బ్రిక్స్‌లో దేశాల మొత్తం జనాభా 324 కోట్లు. ఈ దేశాల జీడీపీ 26 ట్రిలియన్ డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు 2 వేల 162 లక్షల కోట్లు. ఇది ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో 26 శాతం. ఇంటర్నేషనల్ మానీటరి ఫండ్, వరల్డ్ బ్యాంక్ లాంటి అంతర్జాతీయ సంస్థల్లో అభివృద్ధి చెందుతున్న దేశాల ప్రాతినిథ్యం పెంచడం సహా వాటి గొంతు వినిపించేందుకు ఈ కూటమి ఏర్పాటైంది. 2014లో బ్రిక్స్ దేశాలు 250 బిలియన్ డాలర్లతో న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ - NDBని ఏర్పాటు చేశాయి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు రుణాలు ఇవ్వడమే ఈ బ్యాంకు ఉద్దేశం. అయితే బ్రిక్స్‌లో సభ్యత్వం లేని ఈజిప్టు, యూనైటెడ్ అరబ్ ఎమిరెట్స్‌లకు సైతం NDBలో సభ్యత్వముంది.