Telugu Global
International

మరో పెళ్లికి సిద్ధమైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు బెజోస్‌

క్రిస్మస్‌ రోజున తన ప్రియురాలు లారెన్‌ శాంచెజ్‌ వివాహం చేసుకోనున్న జెఫ్‌ బెజోస్‌

మరో పెళ్లికి సిద్ధమైన అమెజాన్‌ వ్యవస్థాపకుడు బెజోస్‌
X

అమెజాన్‌ వ్యవస్థాపకుడు, ఎగ్జిక్యూటివ్‌ ఛైర్మన్‌ జెఫ్‌ బెజోస్‌మరో పెళ్లికి సిద్ధమయ్యారు. ఆయన తన ప్రియురాలు లారెన్‌ శాంచెజ్‌ వివాహం చేసుకోనున్నారు. వారిద్దరికి ఇదివరకే పెళ్లిల్లు అయ్యాయి. డిసెంబర్‌ 25 కొలరాడోలోని కొంతమంది ఫ్రెండ్స్‌, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరగనున్నది. ఈ మేరకు అంతర్జాతీయ మీడియాలో కథనాలు వెల్లడించాయి. గత ఏడాది మేల నెలలో బెజోస్‌-లారెన్‌ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నట్టు వార్తలు వచ్చాయి. లారెన్‌ తో కలిసి ఫ్రాన్స్‌లో విహారానికి వెళ్లిన బెజోస్‌ విలాసవంతమైన నౌకలో రూ 21 కోట్ల విలువ చేసే గులాబీ రంగు వజ్రం ఉంగరం ఇచ్చి ప్రపోజ్‌ చేసినట్లు తెలుస్తోంది. 54 ఏళ్ల లారెన్‌ గతంలో జర్నలిస్టుగా పనిచేశారు. 2018 నుంచి వాళ్లిద్దరు సహజీనవం చేస్తున్నట్లు తెలుస్తోంది. 2019లో జెఫ్‌ బెజోస్‌ తన భార్య మెకంజీ స్కాట్‌ తో 25 ఏళ్ల బంధానికి ముగింపు పలుకుతూ విడాకులు తీసుకున్నాడు. మెకంజీతో బెజోస్‌కు నలుగురు పిల్లలు ఉన్నారు. మరోవైపు లారెన్‌కు గతంలో హాలీవుడ్‌ ఏజెంట్‌ బిజినెస్‌ పాట్రిక్‌ వైడ్‌తో పెళ్లి జరిగింది. వారికి ఇద్దరు పిల్లలున్నారు.

First Published:  15 Nov 2024 9:38 AM IST
Next Story