కాషాయం ధరించినా కోపతాపాలు తగ్గలేదు..రోడ్డున పడి కొట్టుకున్న స్వామీజీలు
ఇద్దరు స్వామీజీలు తన్నుకున్నారు. తమిళనాడుకు చెందిన ఓ స్వామీజీ సింగపూర్ వెళ్ళగా అక్కడి స్థానిక స్వామీజీకీ ఈయనకు మధ్య ఎవరు గొప్ప అనే విశయంపై వివాదం వచ్చి తన్నుకున్నారు.
నిస్వార్ధానికి, ఈర్ష్యాద్వేషాలకు అతీతంగా ఉండాల్సిన ఇద్దరు స్వామీజీలు ఒకరిపై ఒకరు కలియబడి కొట్టుకున్న సంఘటన పలువురిని ఆశ్చర్యపరుస్తోంది. వంటి మీద కాషాయం ఉన్నా వంట్లో మాత్రం అసూయ ద్వేషాలు నిండిపోయిన ఓ స్వామీజీ సాటి మరో స్వామీజీని తీవ్రంగా అవమానపరిచి గుడ్డలు విప్పదీసి ఉరికిస్తూ కొట్టాడు. ఈ సంఘటన సింగపూర్ లో జరిగింది. ఈ దృశ్యాలు ఉన్న వీడియో తమిళనాడులో వైరలవుతోంది.
ఈ ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. తంజావూరు జిల్లా పుదుకొట్టైకి చెందిన రుద్ర సిద్ధ రాజ్ కుమార్ స్వామీజీ వివిధ రోగాలు నయం చేయడంలో సిద్ధహస్తుడనే పేరుంది. కడుపులో కత్తి పెట్టి రోగాలు నయం చేస్తాడని ప్రచారంలో ఉంది. ఇది తెలుసుకున్న సింగపూర్ లోని ఓ భక్తుడు తన తండ్రి ఆరోగ్యాన్ని నయం చేయడానికి సింగపూర్ రావాలని రాజ్ కుమార్ ను కోరాడు.
దీంతో ఆయన సింగపూర్ వెళ్లారు. భక్తుడి ఇంటికి వెళ్లే సమయానికి సింగపూర్ కు చెందిన హల్క్ స్వామీజీ అనే ఆయన కూడా అక్కడే ఉన్నారు. ఇద్దరు కూడా భక్తున్ని ఆశీర్వదించిన తర్వాత మాటల్లో పడ్డారు. ఈ సందర్భంగా తామిద్దరిలో ఎవరు గొప్ప అనే అంశంపైకి చర్చ మళ్సింది. ఈ సమయంలో ఇద్దరి మధ్యా మాటా మాటా పెరిగింది. చివరికి రాజ్ కుమార్ పై హల్క్ స్వామీజీకి ఆగ్రహం కలిగింది. చేయి చేసుకునే వరకూ వెళ్ళింది. అంతటితో ఆగలేదు హల్క్ స్వామీ. ఆగ్రహంతో రాజ్ కుమార్ స్వామీజీ గొంతు పట్టుకుని.. గుడ్డలు విప్పి ఇంటి నుంచి బయటకు గెంటేశాడు హల్క్ స్వామీజీ. రాజ్ కుమార్ గొంతుపట్టుకుని ఉన్న దృశ్యాలు ఉన్న ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.