న్యూజిలాండ్ లో బతుకమ్మ వేడుకలు
ఆక్లాండ్ లో సంబురాలు చేసుకున్న తెలంగాణ ఆడపడుచులు
న్యూజిలాండ్ లోని ఆక్లాండ్ లో బతుకమ్మ సంబరాలు వైభవంగా జరిగాయి. అక్కడ నివసిస్తున్న తెలంగాణ ఆడపడుచులు బతుకమ్మ పాటలు పాడుతూ ఆడారు. ఈ వేడుకల్లో మాజీ మంత్రి నిరంజన్ రెడ్డి పాల్గొని మాట్లాడారు. బతుకమ్మ తెలంగాణ ఆత్మగౌరవానికి, సాంస్కృతిక వైభవానికి ప్రతీక అన్నారు. పూవులను దేవతా స్వరూపంగా పూజించే ఏకైక పండుగ బతుకమ్మ అని తెలిపారు. తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్‌ఎస్ చొరవతో ఈ పండుగ విశ్వవ్యాప్తం అయ్యిందన్నారు. 14 ఏళ్ల ఉద్యమంతో ప్రపంచానికి బతుకమ్మ వైభవాన్ని చాటి చెప్పామన్నారు. న్యూజిలాండ్ బతుకమ్మ వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఉత్సవంలో హెడ్ ఆఫ్ ఛాన్సరీ సంజీవ్ కుమార్, వైస్ కౌన్సిల్ దివ్యాజీ, మినిస్టర్ ఆఫ్ ఎతిని హెలెన్ కరెన్ చౌర్, ఎంపీ పరమ్ జిత్, నాయకులు కళ్యాణ్ రావు, రామ్ మోహన్, రామారావు, అరుణ్ ప్రకాష్, కిరణ్ పోకాల, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.