Telugu Global
International

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)తో మీడియాకు ముప్పు ఉందా..?

ప్రముఖ జర్మన్ మీడియా సంస్థ ఆక్సెల్ స్ప్రింగర్ తన న్యూస్‌ రూమ్ సిబ్బందిలో 20 శాతం మందిని తొలగించి వారి పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అప్పగించింది. ఎడిటర్లు, ఫోటో ఎడిటర్లను ఏఐ టెక్నాలజీతో భర్తీ చేసింది.

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)తో మీడియాకు ముప్పు ఉందా..?
X

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని సాంకేతిక విప్లవంగా భావించినా ఆ తర్వాత అది అసలుకే ఎసరు తెస్తోందని ఉద్యోగులు భయపడిపోతున్నారు. వారి భయాలకు తగ్గట్టే ఐటీ రంగంలో కొలువుల కోత మొదలైంది. మరికొన్ని రంగాలను కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావితం చేస్తోందని తెలుస్తోంది. మనుషులు చేయాల్సిన పనుల్ని టెక్నాలజీ చేసి పెడుతోంది. యజమానికి ఖర్చు తగ్గిస్తోంది. ఇప్పుడు దీని ప్రభావం మీడియాపై కూడా కనపడుతోంది. జర్మనీకి చెందిన ప్రముఖ మీడియా సంస్థ ఆక్సెల్ స్ప్రింగర్ తన న్యూస్ రూమ్ సిబ్బందిలో 20శాతం మందిని తొలగించింది.

మనిషి చేయాల్సిన పని కంప్యూటర్ సమర్థంగా నిర్వహించగలిగితే ఇక ఆ మనిషితో యాజమాన్యానికి అవసరం ఉండదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చాక మానవుల ఆలోచనా విధానాన్ని అంచనా వేసి, అచ్చం మనం చేసినట్టే మన పని కంప్యూటర్ చేసి పెడుతోంది. దీంతో కొన్ని రంగాల్లో మానవ వనరుల అవసరం బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా ఐటీరంగంపై దీని ప్రభావం ఎక్కువగా కనపడుతోంది. అయితే ఇప్పుడు మీడియాలో కూడా AI చిచ్చు పెడుతున్నట్టు తెలుస్తోంది.

ప్రముఖ జర్మన్ మీడియా సంస్థ ఆక్సెల్ స్ప్రింగర్ తన న్యూస్‌ రూమ్ సిబ్బందిలో 20 శాతం మందిని తొలగించి వారి పనిని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కి అప్పగించింది. ఎడిటర్లు, ఫోటో ఎడిటర్లను ఏఐ టెక్నాలజీతో భర్తీ చేసింది. వీరితోపాటు.. ప్రూఫ్‌ రీడర్‌ లు, ప్రింటిగ్ సెక్షన్ లో పనిచేస్తున్న పలువురి స్థానాలు కూడా AIతో భర్తీ చేయాలని చూస్తోంది ఆక్సెల్ స్ప్రింగర్ సంస్థ. ఈ సంస్థ నడిపే బిల్డ్ అనే వార్తాపత్రికలో ప్రస్తుతం కొలువుల కోత మొదలైంది. త్వరలో ఇది మిగతా మీడియా సంస్థలకు కూడా ఇది పాకే అవకాశముంది.

First Published:  23 Jun 2023 12:18 PM IST
Next Story