Telugu Global
International

ఆపిల్ వాచ్ మోస పూరితం, జాతి వివక్షతో కూడుకున్నది....కేసు నమోదు

ఆపిల్ వాచ్‌లోని బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్ ద్వారా మన రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవచ్చు. అయితే న‌లుపు వ‌ర్ణం ఉన్న‌వారికి ఈ మీటర్ సరి అయిన రిజల్ట్స్ చూపించడం లేదని తేలింది.

ఆపిల్ వాచ్ మోస పూరితం, జాతి వివక్షతో కూడుకున్నది....కేసు నమోదు
X

ఆపిల్ వాచ్ ప్రస్తుతం ఫుల్ ట్రెండింగ్ లో ఉంది డబ్బులున్న యూత్ లో ఆ వాచ్ క్రేజ్ కొనసాగుతోంది. అయితే ప్రస్తుతం ఆపిల్ వాచ్ వర్ణవివక్షతో కూడుకున్నదని,ప్రజలను తప్పు దారి పట్టిస్తున్నదనే ఆరోపణలు ఎదుర్కొంటున్నది.

ఆపిల్ వాచ్‌లోని బ్లడ్ ఆక్సిజన్ సెన్సార్ ద్వారా మన రక్తంలోని ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవచ్చు. అయితే న‌లుపు వ‌ర్ణం ఉన్న‌వారికి ఈ మీటర్ సరి అయిన రిజల్ట్స్ చూపించడం లేదని తేలింది.

దీనివల్ల కరోనా సమయంలో ఆపిల్ వాచ్ ను ఉపయోగించిన లక్షలాది మంది ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వచ్చిందని ఆరోపిస్తూ, మోసం, వర్ణ వివక్ష తదితర నేరాలపై ఆపిల్ వాచ్ కంపెనీపై అలెక్స్ మోరేల్స్ అనే వ్యక్తి కేసు నమోదు చేశారు.

ఒక్క నలుపు రంగు వారికే కాక హిస్పానిక్,ఆసియన్ రోగులకు కూడా సరిఅయిన ఫలితాలు చూపించడం లేదని అతను ఆరోపించారు.

వినియోగదారుల మోసం చట్టాల కింద యాపిల్ వాచ్‌ల న్యూయార్క్ కొనుగోలుదారుల తరపున, అనేక ఇతర రాష్ట్రాల తరపున వాది అలెక్స్ మోరేల్స్ ఈ వ్యాజ్యాన్ని దాఖలు చేశారు. ఇది న్యూయార్క్ జనరల్ బిజినెస్ లా, స్టేట్ కన్స్యూమర్ ఫ్రాడ్ చట్టాల ప్రకారం ఎక్స్‌ప్రెస్ వారంటీ, మోసం, వర్ణ వివక్ష తదితర ఉల్లంఘనలకు వ్యతిరేకంగా ఈ కేసు నమోదు చేశారు. యాపిల్ వాచ్‌లో ఉన్న ఆక్సిజ‌న్ మీట‌ర్ రోగుల్ని త‌ప్పుదారి ప‌ట్టించిన‌ట్లు కూడా ఓ స్ట‌డీ రిపోర్ట్‌ను కేసులో ఫైల్ చేశారు.

First Published:  31 Dec 2022 1:35 PM IST
Next Story