Telugu Global
International

అమెరికాలో జడ్జిగా తెలుగు మహిళ

భారతీయ సంతతి అమెరికా పౌరురాలైన జయ బాడిగ.. ఇదే కోర్టులో గత రెండేళ్లుగా కమిషనర్‌గా సేవలందిస్తున్నారు. డెమొక్రటిక్‌ పార్టీ సభ్యురాలైన జయ 2020లో కాలిఫోర్నియా ఆరోగ్య పరిరక్షణ సేవల విభాగంలో అటార్నీగా పనిచేశారు.

అమెరికాలో జడ్జిగా తెలుగు మహిళ
X

విజయవాడలో పుట్టి, హైదరాబాద్‌లో పెరిగిన జయ బాడిగ ఇప్పుడు అమెరికాలో జడ్జిగా నియమితులయ్యారు. అంతేకాదు ఆమె తాజాగా శాక్రామెంటో కౌంటీ సుపీరియర్‌ కోర్టు న్యాయమూర్తిగా ఎంపికవడం విశేషం. కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్‌ గవిన్‌ న్యూసమ్‌ ఆమెను న్యాయమూర్తిగా నియమించారు. కుటుంబంతో కలసి అమెరికాలో స్థిరపడిన జయ బాడిగ.. అక్కడే న్యాయ విద్య చదివారు. ఆ తర్వాత న్యాయవాద వృత్తి మొదలుపెట్టి.. ఇటీవల జడ్జిగా ఎంపికయ్యారు.

భారతీయ సంతతి అమెరికా పౌరురాలైన జయ బాడిగ.. ఇదే కోర్టులో గత రెండేళ్లుగా కమిషనర్‌గా సేవలందిస్తున్నారు. డెమొక్రటిక్‌ పార్టీ సభ్యురాలైన జయ 2020లో కాలిఫోర్నియా ఆరోగ్య పరిరక్షణ సేవల విభాగంలో అటార్నీగా పనిచేశారు. 2018లో కాలిఫోర్నియా గవర్నర్‌ కార్యాలయంలో అత్యవసర సేవల విభాగంలో సేవలందించారు. శాంటాక్లారా విశ్వవిద్యాలయంలో లా చదివిన ఆమె.. బోస్టన్‌ విశ్వవిద్యాలయంలోని ఇంటర్నేషనల్‌ రిలేషన్స్, ఇంటర్నేషనల్‌ కమ్యూనికేషన్స్‌ విభాగంలో ఎంఏ చేశారు. కుటుంబ కేసులు, తగాదాలను పరిష్కరించడంలో జయ పది సంవత్సరాల అనుభవం గడించారు.

First Published:  24 May 2024 10:43 AM IST
Next Story