Telugu Global
International

స్ప్రేతో క‌రోనాకు చెక్‌..! - నూతన ఆవిష్క‌ర‌ణ‌ను అభివృద్ధి చేసిన అమెరిక‌న్ శాస్త్ర‌వేత్త‌లు

క‌రోనా వైర‌స్ సాధార‌ణంగా ఊపిరితిత్తుల్లోని క‌ణాల్లో ఉండే ఏస్‌2గా పిలిచే రిసెప్ట‌ర్‌లోకి తొలుత చొచ్చుకుపోతుంది. త‌ద్వారా క‌ణంలోకి ప్ర‌వేశించి వృద్ధి చెందుతుంది.

స్ప్రేతో క‌రోనాకు చెక్‌..! - నూతన ఆవిష్క‌ర‌ణ‌ను అభివృద్ధి చేసిన అమెరిక‌న్ శాస్త్ర‌వేత్త‌లు
X

క‌రోనా వైర‌స్‌ను అడ్డుకునేందుకు కొత్త ర‌కం అణువుల‌ను అమెరిక‌న్ శాస్త్ర‌వేత్త‌లు అభివృద్ధి చేశారు. వాటిని స్ప్రే ద్వారా ముక్కులోకి పీల్చ‌డం వ‌ల్ల క‌రోనాతో పాటు సార్స్ వంటి వైర‌స్‌ల‌ను స‌మ‌ర్థంగా అడ్డుకోవ‌చ్చ‌ని చెబుతున్నారు. స‌న్న‌గా, పోగులు మాదిరిగా ఉండే వీటిని సుప్రా మాలిక్యుల‌ర్ ఫిల‌మెంట్స్ (ఎస్ఎంఎఫ్‌) అని పిలుస్తున్నారు. అమెరికాలోని జాన్స్ హాప్కిన్స్ యూనివ‌ర్సిటీ శాస్త్ర‌వేత్త‌లు వీటిని అభివృద్ధి చేశారు.

క‌రోనా శ్వాస ద్వారా సోకుంతున్న‌ది తెలిసిందే.. ఎస్ఎంఎఫ్ స్పాంజ్ మాదిరిగా క‌రోనా వంటి వైర‌స్‌ల‌ను పీల్చుకుంటుంది.. త‌ద్వారా అవి ఊప‌రితిత్తుల్లోని క‌ణాల‌తో క‌లిసిపోయి వ్యాధి కార‌కాలుగా మార‌కుండా చూస్తుంద‌ని వ‌ర్సిటీ అసోసియేట్ ప్రొఫెస‌ర్ హాంగాంగ్ కుయ్ వివ‌రించారు.

వీటిని ఇప్ప‌టికే ఎలుక‌ల‌పై విజ‌య‌వంతంగా ప్ర‌యోగించిన‌ట్టు వారు వెల్ల‌డించారు. క‌రోనా వైర‌స్ సాధార‌ణంగా ఊపిరితిత్తుల్లోని క‌ణాల్లో ఉండే ఏస్‌2గా పిలిచే రిసెప్ట‌ర్‌లోకి తొలుత చొచ్చుకుపోతుంది. త‌ద్వారా క‌ణంలోకి ప్ర‌వేశించి వృద్ధి చెందుతుంది. తాజాగా అభివృద్ధి చేసిన ఎస్ఎంఎఫ్‌ల‌లోని ఫిల‌మెంట్ల‌లోనూ ఇలాంటి సూడో రిసెప్ట‌ర్లు ఉంటాయి. క‌రోనా వైర‌స్‌ను అవి త‌మ‌వైపు ఆక‌ర్షించి అక్క‌డే నిలువ‌రిస్తాయి. క‌రోనా తాలూకూ అన్ని వేరియంట్ల‌నూ ఇది స‌మ‌ర్థంగా అడ్డుకుంటుంద‌ని ప‌రిశోధ‌కులు చెబుతున్నారు.

First Published:  14 Jan 2023 9:19 AM IST
Next Story