Telugu Global
International

ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ వర్కర్స్ సమ్మె!

వేతనాలు పెంచాలని, పని పరిస్థితులను మెరుగుపరచాలన్న డిమాండుతో దాదాపు 40 దేశాల్లోని అమెజాన్‌ వేర్‌హౌస్‌ల ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. "మేక్ అమెజాన్ పే" పేరుతో నిరసన ప్రచారం జరుగుతోంది.

ప్రపంచవ్యాప్తంగా అమెజాన్ వర్కర్స్ సమ్మె!
X

ఇ-కామర్స్ దిగ్గజం అమెజాన్ కంపెనీలో కార్మికులు ప్రపంచవ్యాప్తంగా సమ్మెకు దిగారు. బ్లాక్ ఫ్రైడే సేల్స్ ప్రారంభమైన రోజునే ఈ సమ్మెకు పిలుపునిచ్చాయి కార్మిక సంఘాలు. బిజీ అమ్మకాల మధ్య ప్రపంచవ్యాప్తంగా నిరసనలు, సమ్మెలను ఎదుర్కొంటోంది అమెజాన్.

వేతనాలు పెంచాలని, పని పరిస్థితులను మెరుగుపరచాలన్న డిమాండుతో దాదాపు 40 దేశాల్లోని అమెజాన్‌ వేర్‌హౌస్‌ల ముందు కార్మికులు ఆందోళన చేపట్టారు. "మేక్ అమెజాన్ పే" పేరుతో నిరసన ప్రచారం జరుగుతోంది.

"నేటి సమ్మె అమెజాన్ యొక్క దోపిడీకి వ్యతిరేకంగా కార్మికుల ప్రతిఘటన స్థాయిని చూపుతుంది. " అని యూనియన్ యొక్క సమన్వయకర్త కాస్పర్ గెల్డర్‌బ్లోమ్ అన్నారు. కార్మికులకు శ్రమకు తగ్గ ఫలితం ఉండాలని, పది గంటలకు పైగా పని చేయించుకుంటూ వేతనాలు మాత్రం అతితక్కువ చెల్లిస్తున్నారని ఆయన ఆరోపించారు.

ప్రభుత్వాలకు అమెజాన్ న్యాయమైన పన్నులు చెల్లించాలని, పర్యావరణ పరిరక్షణకు కట్టుబడి ఉండాలని అ‍ంతర్జాతీయ యూనియన్ల సమాఖ్య డిమాండ్ చేస్తోంది.

భారత్‌తో పాటు అమెరికా, జపాన్‌, ఫ్రాన్స్‌, జర్మనీ, యూకే తదితర దేశాల్లో కార్మికులు పనులు బహిష్కరించి ప్రదర్శనలు నిర్వహించారు. కార్మికుల డిమాండ్లను పరిష్కరించాలని, వేతనాల పెంపు, మెరుగైన పని పరిస్థితులు కల్పించేందుకు యూనియన్లతో చర్చలు జరుపాలని యూకేలో జీఎంబీ యూనియన్‌ నేత అమంద గేరింగ్ డిమాండ్‌ చేశారు. క్రిస్మస్‌ సీజన్‌ నేపథ్యంలో ఓవర్‌టైమ్‌కు అనుగుణంగా బోనస్‌ ఇవ్వాలన్నారు.

భారత్‌లో ఢిల్లీ జంతర్‌మంతర్‌తో పాటు యూపీ, ఉత్తరాఖండ్‌, బీహార్‌, మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్‌, రాజస్థాన్‌ తదితర రాష్ట్రాల్లో ఆందోళనలు జరిగాయి.

First Published:  26 Nov 2022 3:14 PM IST
Next Story