Telugu Global
International

వారంలో 3 రోజులు ఆఫీస్ కి రావాల్సిందే –అమెజాన్

వారంలో 3రోజులు ఉద్యోగులు ఆఫీస్ లకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈమేరకు ఉద్యోగులకు మెయిల్స్ పంపించింది అమెజాన్ సంస్థ. మే-1నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుందని స్పష్టం చేసింది.

వారంలో 3 రోజులు ఆఫీస్ కి రావాల్సిందే –అమెజాన్
X

లేఆఫ్ లతో ఉద్యోగులకు షాకిస్తున్న ఐటీ కంపెనీలు, మరోవైపు ఆఫీస్ లకు రావాల్సిందేనంటూ సిబ్బందిపై ఒత్తిడి పెంచుతున్నాయి. ఇప్పటి వరకూ ఆప్షనల్ గా ఉన్న హైబ్రిడ్ మోడ్ ఇక కంపల్సరీ కాబోతోంది. అమెజాన్ కంపెనీ దీనిపై నిర్ణయం తీసేసుకుంది.


వారంలో 3రోజులు ఉద్యోగులు ఆఫీస్ లకు రావాల్సిందేనని తేల్చి చెప్పింది. ఈమేరకు ఉద్యోగులకు మెయిల్స్ పంపించింది అమెజాన్ సంస్థ. మే-1నుంచి కొత్త విధానం అమలులోకి వస్తుందని తేల్చి చెప్పింది.

హైబ్రిడ్ తో మొదలు..

ఇప్పటి వరకూ ఉద్యోగులు వర్క్ ఫ్రమ్ హోమ్ కి అలవాటు పడ్డారు. మెల్లగా వారిని ఆఫీస్ లకు రప్పించే దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. వారానికి రెండు రోజులు రండి చాలు అంటూ సందేశాలు పంపించాయి. అది కూడా అవకాశం ఉన్నవారికి మాత్రమేనని అన్నారు.

ఆ తర్వాత ఇప్పుడు కొన్ని కంపెనీలు వారానికి 3 రోజులు, 4 రోజులు అంటూ మెసేజ్ లు పంపిస్తున్నాయి. ఇప్పుడిది కంపల్సరీ అంటున్నారు. జనవరిలో స్టార్ బక్స్ కంపెనీ తమ ఉద్యోగుల్ని వారంలో 3రోజులపాటు ఆఫీస్ కి రావాల్సిందిగా కోరింది.

డిస్నీ సంస్థ మార్చి నుంచి వారంలో 4 రోజుల ఆఫీస్ అనే కొత్త విధానం అమలులోకి తెస్తోంది. వాల్ మార్ట్ కూడా తమ ఐటీ సిబ్బందిని ఆఫీస్ లకు రావాల్సిందేని చెప్పింది.

ఓ దశలో వర్క్ ఫ్రమ్ హోమ్ అనే విధానమే కంపెనీలకు కూడా లాభసాటిగా మారిందనే ప్రచారం జరిగింది. అయితే ఆ తర్వాత మూన్ లైటింగ్ ద్వారా చాలామంది రెండు మూడు ఉద్యోగాలు వెదుక్కున్నారు.

దీంతో కంపెనీలు కఠిన చర్యలు తీసుకున్నాయి. ఈ గొడవంతా ఎందుకంటూ ఇప్పుడు ఉద్యోగుల్ని తిరిగి ఆఫీస్ లకు రమ్మంటున్నాయి కంపెనీలు. కొవిడ్ తర్వాత పరిస్థితులు పూర్తిగా చక్కబడటంతో ఉద్యోగులు హైబ్రిడ్ మోడ్ కి అలవాటు పడాల్సిందేనని తేల్చి చెబుతున్నాయి. త్వరలో 5డే వీక్ కూడా అమలయ్యే అవకాశాలు స్పష్టంగా కనపడుతున్నాయి.

First Published:  19 Feb 2023 9:58 AM IST
Next Story