Telugu Global
International

పాలస్తీనాలో అల్‌ జజీరాపై నిషేధం

పాలస్తీనా నిర్ణయాన్ని తీవ్రంగా ఖండించిన హమాస్‌

పాలస్తీనాలో అల్‌ జజీరాపై నిషేధం
X

ఇజ్రాయెల్-హమాస్‌ మధ్య భీకర పోరు కొనసాగుతున్న వేళ పాలస్తీనా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఖతార్‌కు చెందిన అల్‌ జజీరా వార్తా సంస్థ పాలస్తీనా తాత్కాలికంగా నిషేధం విధించింది. తమ ప్రాంతంలో రెచ్చగొట్టే ప్రసంగాలను ప్రసారం చేస్తున్నదనే ఆరోపణలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అక్కడి వార్తా సంస్థలు వెల్లడించాయి. ప్రత్యేక కమిటీ అల్‌ జజీరా వార్తా ప్రసారాలు నిలిపివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాయి. తప్పుడు సమాచారం, రెచ్చగొట్టే ప్రసంగాలను ప్రసారం చేయడంతో పాటు తమ అంతర్గత వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటున్నట్లు పాలస్తీనా అధికారులు ఆరోపించారు. అందువల్లనే అల్‌ జజీరా వార్త సంస్థపై నిషేధం విధించినట్లు చెప్పారు. మరోవైపు అల్‌ జజీరాపై నిషేధం విధించడాన్ని హమాస్‌ ఖండించింది. ప్రజా హక్కులు, స్వేచ్ఛను కాలరాయడానికే పాలస్తీనా అథారిటీ ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నదని విమర్శించింది.

First Published:  2 Jan 2025 12:19 PM IST
Next Story