Telugu Global
International

అదానీకి షాక్ ఇచ్చిన అంతర్జాతీయ సంస్థ డో జోన్స్‌

పలు అంతర్జాతీయ స్టాక్‌ సూచీలను, వివిధ దేశాల స్టాక్‌ సూచీలను రూపొందించి, నిర్వహించే ఎస్‌అండ్‌పీ డో జోన్స్‌, అదానీ గ్రూప్‌కు పెద్ద షాక్‌ ఇచ్చింది. డో జోన్స్‌ సైస్టెన్‌బిలిటీ ఇండెక్స్‌ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.ఇది ఫిబ్రవరి 7 నుండి అమలులోకి వస్తుంది.

అదానీకి షాక్ ఇచ్చిన అంతర్జాతీయ సంస్థ డో జోన్స్‌
X

హిండెన్ బర్గ్ నివేదిక తర్వాత అదానీ గ్రూపు ఆదాయం వేగంగా క్షీణిస్తూ వస్తోంది. వారంరోజుల్లో అదానీ గ్రూపుల 9 లక్షల కోట్ల సొమ్ము ఆవిరయ్యిపోయింది. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సంస్థలు కుడా అదానీకి షాక్ ఇస్తున్నాయి.

పలు అంతర్జాతీయ స్టాక్‌ సూచీలను, వివిధ దేశాల స్టాక్‌ సూచీలను రూపొందించి, నిర్వహించే ఎస్‌అండ్‌పీ డో జోన్స్‌ అదానీ గ్రూప్‌కు పెద్ద షాక్‌ ఇచ్చింది. డో జోన్స్‌ సైస్టెన్‌బిలిటీ ఇండెక్స్‌ నుంచి అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ను తొలగిస్తున్నట్టు ప్రకటించింది.ఇది ఫిబ్రవరి 7 నుండి అమలులోకి వస్తుంది.

అంతేకాక నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) అదానీ ఎంటర్‌ప్రైజెస్, అదానీ పోర్ట్స్, అంబుజా సిమెంట్స్ షేర్లపై అదనపు నిఘా ఉంచినట్లు తెలిపింది. అంటే ఆ సంస్థల స్టాక్‌లు మరింత కఠినమైన నిబంధనలకు లోబడి ఉంటాయి.

అంతేకాకుండా, NSE రెండు అదానీ గ్రూప్ స్టాక్స్ అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్ లిమిటెడ్, అంబుజా సిమెంట్స్ లపై కూడా ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ (F&O) కింద నిషేధం విధించింది.

గత ఏడాది ప్రపంచంలోనే రెండో అత్యంత సంపన్నుడిగా నిలిచిన గౌతమ్ అదానీ ఇప్పుడు ఆసియాలో కూడా అత్యంత సంపన్నుడు కాదు. అతను ఫిబ్రవరి 2, 2023 నాటికి ప్రపంచంలోని అత్యంత సంపన్న వ్యక్తుల జాబితాలో 21వ స్థానానికి పడిపోయాడు. అతని ప్రత్యర్థి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ (RIL) చైర్మన్ ముఖేష్ అంబానీ ఇప్పుడు ఆసియాలో అత్యంత ధనవంతుడు.

First Published:  4 Feb 2023 12:02 PM IST
Next Story