Telugu Global
International

'దేవుడితో అపాయింట్ మెంట్ కావాలా? ... జస్ట్ 96వేలు చెల్లించండి'

క్రిస్ మస్ సందర్భంగా ఈ నెల 25 న దేవుడితో అపాయింట్ ఇప్పిస్తానంటూ దక్షిణాఫ్రికాకు చెందిన ఒక పాస్టర్ తెగ హడావుడి చేస్తున్నాడు. దేవుడితో అపాయింట్ కోసం 96 వేల రూపాయలు, మీకు ఒక్క రోజులో పెళ్ళి కావాలంటే 49,000 రూపాయలు, మీకున్న అప్ప్ను రద్దు చేసుకోవాలంటే 24,000 రూపాయలు, నేరాల నుంచి రక్షణ కోసం, మీ భవిష్యత్తును చూసుకోవడం కోసం ఒక్కొక్కరికి 97,000 రూపాయలు చెల్లించాలంటూ, 'ఏవియేటర్ గేమ్' గెలవాలంటే 14.5 లక్షల రూపాయలు చెల్లించాలంటూ తన ఫోటో తో కూడిన రేట్ కార్డ్ ను ప్రింట్ చేసి అన్ని చోట్ల పోస్టర్లు అంటించాడు.

దేవుడితో అపాయింట్ మెంట్ కావాలా? ... జస్ట్ 96వేలు చెల్లించండి
X

దేవుడి ఏజెంట్లుగా చెలామణి అవుతున్నవారు ప్రపంచంలో కుప్పలు కుప్పలుగా ఉన్నారు. ఒక్కో దేశంలో ఒక్కో పేర్లతో పిలవబడే వీళ్ళు దేవుడితో తాము డైరెక్ట్ గా మాట్లాడుతామని, దేవుడు తమకు చాలా సన్నిహితమని, తామేం చెప్పినా దేవుడు వింటాడని ప్రచారం చేసుకుంటూ అమాయక జనాలను బుట్టలో వేసుకుంటూ ఉంటారు.

దేవుడిని చూపిస్తామని, అపాయింట్ మెంట్ ఇప్పిస్తామని, ఆయనతో శిఖరాగ్ర సమావేశం ఏర్పాటు చేస్తామని, మీకు ఏ కోరికలున్నా ఆయన ద్వారా తీరేట్టు చేస్తామని చెప్తూ అందుకు రేటు కట్టి వసూలు చేస్తూ ఉంటారు.

క్రిస్ మస్ సందర్భంగా ఈ నెల 25 న దేవుడితో అపాయింట్ ఇప్పిస్తానంటూ దక్షిణాఫ్రికాకు చెందిన ఒక పాస్టర్ తెగ హడావుడి చేస్తున్నాడు. దేవుడితో అపాయింట్ కోసం 96 వేల రూపాయలు, మీకు ఒక్క రోజులో పెళ్ళి కావాలంటే 49,000 రూపాయలు, మీకున్న అప్ప్ను రద్దు చేసుకోవాలంటే 24,000 రూపాయలు, నేరాల నుంచి రక్షణ కోసం, మీ భవిష్యత్తును చూసుకోవడం కోసం ఒక్కొక్కరికి 97,000 రూపాయలు చెల్లించాలంటూ, 'ఏవియేటర్ గేమ్' గెలవాలంటే 14.5 లక్షల రూపాయలు చెల్లించాలంటూ తన ఫోటో తో కూడిన రేట్ కార్డ్ ను ప్రింట్ చేసి అన్ని చోట్ల పోస్టర్లు అంటించాడు.

బుదేలి అనే ఈ పాస్టర్ ఏసు క్రీస్తుతో తనకు చాలా సన్నిహిత సంబంధాలున్నాయని చెప్పుకుంటాడు. తాను ఎప్పుడంటే అప్పుడు దేవుడితో డైరెక్ట్ గా మాట్లాడతానని కూడా ప్రచారం చేసుకుంటాడు.

అయితే ఈ ఆఫర్ ఈ నెల 25 వరకే ఉంది. ఈ ఆరాధన సదస్సు" డిసెంబర్ 25 వరకు మాత్రమే సాగుతుంది అని తన‌ను సంప్రదించాల్సిన‌ వివరాలను పోస్టర్‌లో ప్రింట్ చేశాడు.

ఈ మాత్రం చేసి గొప్పనుకుంటున్నాడేమో బుదేలి అనే ఈ పాస్టర్. మాదగ్గర కూడా వర్షాలను ఆపే వాళ్ళు, సూర్యుడిని తమకు కావాల్సిన సమయంలో ఉదయించాలని ఆదేశించే వాళ్ళు. మనకు ఏది కావాలంటే దాన్ని గాలిలోంచి సృష్టించేవాళ్ళు. దేవుడితో రోజూ మాట్లాడే వాళ్ళు ఉన్నారని, ఓట్లను కురిపించే పశువులు కూడా ఉన్నాయని ఆయనకెవరన్నా చెప్పండయ్యా!

First Published:  24 Dec 2022 2:06 PM IST
Next Story