Telugu Global
International

భారత్ లో 456 భాషలు మాట్లాడుతారు

వరల్డ్ ఇండెక్స్ సంస్థ ఎత్నోలాగ్-2022 పేరిట ప్రపంచంలో అత్యధిక భాషలు వాడుకలో ఉన్న దేశాల టాప్-10 జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పసిఫిక్ ద్వీప దేశం పాపువా న్యూగినియా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

భారత్ లో 456 భాషలు మాట్లాడుతారు
X

93 లక్షల జనాభా ఉన్న ఓ చిన్న దేశంలో ప్రజలు 840 భాషలు మాట్లాడుతారు. ఆశ్చ‌ర్యంగా ఉన్నా ఇదినిజం. పాపువా న్యూగినియా అనే దేశంలో 840 భాషలు వాడుకలో ఉన్నట్టు వరల్డ్ ఇండెక్స్ వెల్లడించింది. పాపువా న్యూగినియా జనాభా కేవలం 93 లక్షలే. అయినప్పటికీ పెద్ద సంఖ్యలో తెగలు ఇక్కడ జీవిస్తుండడంతో ఇన్ని భాషలు వాడుకలో ఉన్నాయి.

వరల్డ్ ఇండెక్స్ సంస్థ ఎత్నోలాగ్-2022 పేరిట ప్రపంచంలో అత్యధిక భాషలు వాడుకలో ఉన్న దేశాల టాప్-10 జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో పసిఫిక్ ద్వీప దేశం పాపువా న్యూగినియా నెంబర్ వన్ స్థానంలో నిలిచింది.

ఇక ఈ జాబితాలో రెండవ స్థాన‍ంలో ఇండోనేషియా, మూడవ‌ స్థానాల్లో నైజీరియా ఉన్నాయి. ఇండోనేషియాలో 715 భాషలు, నైజీరియాలో 527 భాషలు మాట్లాడుతారు.

ఈ జాబితాలో మనదేశం నాలుగో స్థానంలో నిలిచింది. భారత్ లో 456 భాషలు వాడుకలో ఉన్నట్టు వరల్డ్ ఇండెక్స్ పేర్కొంది. ఆ తర్వాత వరుసగా అమెరికాలో 337 భాషలు, ఆస్ట్రేలియా లో317 భాషలు, చైనా లో 307 భాషలు, మెక్సికో లో 301 భాషలు, కామెరూన్ లో277 భాషలు, బ్రెజిల్ లో238 భాషలు మాట్లాడుతారు.

First Published:  27 Dec 2022 10:32 PM IST
Next Story