Telugu Global
International

ఎయిర్ ఇండియా బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు కెనడాలో కాల్చి వేత

ఎయిర్ ఇండియా బాంబు పేలుళ్ల కేసులో నిందితుడు కెనడాలో కాల్చి వేత
X

1985 ఎయిర్ ఇండియన్ బాంబు పేలుళ్ల కేసులో నిందితుల్లో ఒకరైన రిపుదమన్ సింగ్ మాలిక్ ను గురువారంనాడు గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు కెనడాలోని బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో కాల్చివేశారని స్థానిక మీడియా తెలిపింది.

మాలిక్ బావమరిది జస్పాల్ సింగ్ ఈ వార్తలను ధృవీకరించారు. ఆయ‌న మాట్లాడుతూ, "రిపుదామన్‌ను ఎవరు చంపారో మాకు తెలియదు. అతని చెల్లెలు కెనడాకు వెళుతోంది" అన్నారు.

పూర్తిగా మంటల్లో చిక్కుకున్న అనుమానిత వాహనం కనిపించిందని రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు చెప్పారు. అనుమానితుల కోసం, తప్పించుకున్న రెండో వాహనం కోసం గాలిస్తున్నామ‌ని పోలీసులు తెలిపారు.

కాగా ఢిల్లీ నుండి మాంట్రియల్‌కు వెళుతున్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 కనిష్కపై బాంబు దాడిలో మాలిక్, ఇందర్‌జీత్ సింగ్ రేయత్, అజైబ్ సింగ్ బగ్రీ కీలక పాత్ర పోషించారని ఆరోప‌ణ‌లు ఎదుర్కొన్నారు. 2005లో కెనడా కోర్టు రిపుదమన్ సింగ్ మాలిక్ ను నిర్దోషిగా విడుదల చేసింది.

బాంబు పేలుడులో 329మంది మృతి

జూన్ 23, 1985న ఐర్లాండ్ తీరంలో కెనడా నుండి వచ్చిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ 182 "కనిష్క"లో బాంబు పేలింది,. ఈ ఘ‌ట‌న‌లో సిబ్బంది స‌హా 329 మంది ప్రయాణికులు మరణించారు. ఈ దుర్ఘ‌ట‌న‌లో మొత్తం 29 కుటుంబాలు ఆహుత‌య్యాయి. 86 మంది చిన్న పిల్లలతో సహా 280 మంది కెనడియన్ పౌరులు ఉన్నారు.

రిపుదమన్ మాలిక్ పంజాబ్‌లోని అనేక ఉగ్రవాద సంఘటనలకు కారణమైన బబ్బర్ ఖల్సా అనే ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉన్నాయి. ఎయిర్ ఇండియా బాంబు దాడికి ప్రధాన సూత్రధారి అయిన తల్విందర్ సింగ్ పర్మార్‌కు అత‌ను సన్నిహితుడు.

First Published:  15 July 2022 11:10 AM IST
Next Story