Infinix Note 40 Pro 5G | 108-మెగా పిక్సెల్ కెమెరాతో ఇన్‌ఫినిక్స్ నోట్40 ప్రో 5జీ ఫోన్ ఆవిష్కరణ..!
ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ 108 మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ సెన్సర్ విత్ ఎఫ్/1.75 అపెర్చర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతు, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో 2-మెగా పిక్సెల్ మాక్రో షూటర్ ఉంటాయి.
Infinix Note 40 Pro 5G | ప్రముఖ స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ఇన్‌ఫినిక్స్ తన ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ, ఇన్‌ఫినిక్స్ నోట్ 40 5జీ ఫోన్లను గ్లోబల మార్కెట్లలో ఆవిష్కరించింది. వీటితోపాటు ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో+ 5జీ ఫోన్ కూడా ఆవిష్కరించింది. 100 వాట్ల వైర్డ్ ఫాస్ట్ చార్జింగ్ మద్దతుతో బ్యాటరీ వస్తుంది. ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ, ఇన్‌ఫినిక్స్ నోట్ 40ప్రో 5జీ ఫోన్ టైటాన్ గోల్డ్, వింటేజ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో లభిస్తుంది. ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ సుమారు రూ.24 వేలు (289 డాలర్లు) పలుకుతుంది. ఒబ్సిడియన్ బ్లాక్, టైటాన్ గోల్డ్ కలర్స్‌లో లభించే ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ఫోన్ దాదాపు రూ.16,500 (199 డాలర్లు) పలుకుతుంది.
ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ పోన్ 120 హెర్ట్జ్ రీఫ్రెష్ రేట్‌తో 6.78-అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ (2,436 x 1,080 పిక్సెల్స్) కర్వ్‌డ్ అమోలెడ్ స్క్రీన్ కలిగి ఉంటుంది. 1,300 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కలిగి ఉంటుంది. 6ఎన్ఎం మీడియాటెక్ డైమెన్సిటీ 7020 ఎస్వోసీ చిప్ సెట్ 8జీబీ ర్యామ్ విత్ 256 జీబీ స్టోరేజీతో వస్తున్నది. ఆండ్రాయిడ్ 14 బేస్డ్ ఎక్స్ఓఎస్ 14 వర్షన్‌పై పని చేస్తుంది.
ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ 108 మెగా పిక్సెల్ ప్రైమరీ రేర్ సెన్సర్ విత్ ఎఫ్/1.75 అపెర్చర్ విత్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (ఓఐఎస్) మద్దతు, ఎల్ఈడీ ఫ్లాష్ యూనిట్‌తో 2-మెగా పిక్సెల్ మాక్రో షూటర్ ఉంటాయి. డ్యుయల్ రేర్ కెమెరా సెటప్‌కు 2-కే వీడియో రికార్డింగ్ మద్దతుగా ఉంటుంది. సెల్ఫీలూ వీడియో కాల్స్ కోసం 32-మెగా పిక్సెల్ సెన్సర్ కెమెరా ఉంటుంది.
ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్ 45 వాట్ల వైర్డ్ ఆల్‌రౌండ్ ఫాస్ట్ చార్జింగ్ 2.0, 20వాట్ల వైర్‌లెస్ మ్యాగ్ చార్జ్ మద్దతుతో 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీ ఉంటుంది. సెక్యూరిటీ కోసం ఇన్‌డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ తో వస్తుంది. 5జీ, బ్లూటూత్ 5.3, జీపీఎస్, గ్లోనాస్, బైదూ, యూఎస్బీ టైప్-సీ, ఎన్ఎఫ్‌సీ కనెక్టివిటీ కలిగి ఉంటుంది. ఇక ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ఫోన్ ఓక్టాకోర్ 6ఎన్ఎం మీడియాటెక్ హెలియో జీ99 చిప్‌సెట్‌తో వస్తుంది. ఇన్‌ఫినిక్స్ నోట్ 40 ప్రో 5జీ ఫోన్‌లో ఉన్న ఫీచర్లు యధాతథంగా ఉంటాయి.